AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chanakya Niti: ఈ లక్షణాలు మీలో ఉన్నాయా?.. అయితే, ఇతరులకు మీరు ఆదర్శంగా నిలుస్తున్నట్లే..!

Chanakya Niti: ప్రతి వ్యక్తిలో కొంత మంచి, కొన్ని చెడు లక్షణాలు ఉంటాయి. సాధారణంగా, మనిషి దృష్టి ప్రతికూల విషయాల వైపు మళ్లుతుంది. అయితే, ఏ వ్యక్తి అయినా సానుకూలంగా

Chanakya Niti: ఈ లక్షణాలు మీలో ఉన్నాయా?.. అయితే, ఇతరులకు మీరు ఆదర్శంగా నిలుస్తున్నట్లే..!
Shiva Prajapati
|

Updated on: Jan 05, 2022 | 8:55 AM

Share

Chanakya Niti: ప్రతి వ్యక్తిలో కొంత మంచి, కొన్ని చెడు లక్షణాలు ఉంటాయి. సాధారణంగా, మనిషి దృష్టి ప్రతికూల విషయాల వైపు మళ్లుతుంది. అయితే, ఏ వ్యక్తి అయినా సానుకూలంగా ఆలోచించి, తనలోని మంచితనాన్ని మెరుగుపరచుకోవడానికి, చెడు లక్షణాలను తొలగించడానికి కృషి చేస్తే వారు సాధించలేనిది ఈ ప్రపంచంలో ఏదీ ఉండదు. ఇతరులకు ఆదర్శంగా ఉండే వ్యక్తులందరూ ఈ విధానాలనే పాటిస్తుంటారు. వారి నైపుణ్యాలను మెరుగుపర్చుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. ఆచార్య చాణక్య మీ వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోవడానికి కొన్ని సూచనలు చేశారు. ఈ లక్షణాలు ఉంటే.. స్నేహితులే కాదు, శత్రువులు కూడా మిమ్మల్ని అనుసరిస్తారని చెప్పారు. ఈ లక్షణాలు ఒక వ్యక్తిని వేగంగా ప్రగతి పథంలోకి తీసుకెళ్తాయని పేర్కొన్నారు. చాణక్య చెప్పిన ఆ లక్షణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

జ్ఞాన సముపార్జన.. జ్ఞానం ఎవరూ దొంగిలించలేని సంపద. మీరు దానిని ఎంత ఎక్కువ సంపాదిస్తే, అది మీకు అంత గౌరవాన్ని ఇస్తుంది. మీ కోసం పని చేస్తుంది. మీరు ఎంత ఖర్చు చేసినా, అది ఎప్పటికీ ముగియదు. ప్రతిగా జ్ఞానం పెరుగుతుంది. కాబట్టి వీలైనంత వరకు జ్ఞానాన్ని పొందే ప్రయత్నం చేయండి. సనాతన అంధకారాన్ని పారద్రోలే శక్తి జ్ఞానానికి ఉంది.

నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలి.. జ్ఞానంతో పాటు నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడం కూడా కీలకం. మీరు చేసే పనిలో ఎంత ప్రావీణ్యం కలిగి ఉన్నా.. నిరంతర సాధనతో మీ నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటూ ఉండాలి. దీంతో మీరు మీ రంగంలో ఉన్నత స్థానం పొందుతారు. ఇలా నైపుణ్యాలను మెరుగు పరుచుకునే వారు ఏదైనా ముఖ్యమైన పనిలో ముఖ్యమైన పాత్ర పోషిస్తారు. అంతేకాదు.. ఇలాంటి వారికి సామర్థ్యం ఉన్న వ్యక్తులకు జతగా కలుస్తారు.

సిద్ధాంతాలను, విలువలను ఎప్పుడూ విస్మరించొద్దు.. మీరు జీవితంలో ఏ స్థానానికి అయినా చేరుకోవచ్చు, కానీ మీ విలువలను, సిద్ధాంతాలను ఎప్పటికీ వదులుకోకండి. మీ సిద్ధాంతాలు, ఆచారాలు మిమ్మల్ని మీ మూలాలకు కనెక్ట్ చేస్తాయి. అహంకారం ప్రదర్శించకూడదు. ఇలాంటి లక్షణాలు ఉంటే.. మీరు తప్పకుండా ఇతరులకు ప్రేరణగా మారుతారు. ప్రజలు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటారు. మీపై ప్రశంసలు కురిపిస్తారు.

Also read:

Road Accident: ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై రోడ్డు ప్రమాదం.. పేలుడు సంభవించి భారీగా మంటలు..!

China Landslides: చైనాలో విరిగిపడ్డ కొండచరియలు.. 14 మంది మృత్యువాత, మరో ముగ్గురు సీరియస్!

Medical College Raging: మెడికల్ కాలేజీ ర్యాగింగ్ ఘటనలో మరో ట్విస్ట్.. పోలీసుల విచారణలో వెలుగులోకి సంచలనాలు!