Dhanurmasam Thiruppavai: నేడు తిరుప్పావై 21వ పాశురం.. శ్రీకృష్ణా! మేల్కొని మమ్ము కనరా వయ్యా!
వైష్ణవులు పరమ పవిత్రంగా పఠించే ఈ పాశురాలు మధుర భక్తిని ప్రబోధిస్తాయి. ధనుర్మాసంలో నేడు 21వ రోజు. ఈ మాసంలో అమ్మాళ్ రంగనాధుడిని..
విష్ణువును కీర్తిస్తూ, గోదాదేవి మూలద్రావిడంలో గానం చేసిన ముప్ఫై పాశురాల గీతమాలిక. ఇది పన్నిద్దరాళ్వార్లు రచించిన నాలాయిర దివ్య ప్రబంధములో ఒక ముఖ్య భాగమై, తమిళ సాహిత్యంలో ఒక విశిష్ట స్థానాన్ని సంపాదించుకుంది. తిరుప్పావై పన్నిద్దరాళ్వారులలో ఒకరైన గోదాదేవి రచించిన ముప్పది పాశురాల ప్రబంధం. వైష్ణవులు పరమ పవిత్రంగా పఠించే ఈ పాశురాలు మధుర భక్తిని ప్రబోధిస్తాయి. ధనుర్మాసంలో నేడు 21వ రోజు. ఈ మాసంలో అమ్మాళ్ రంగనాధుడిని తన భర్తగా పొందడానికి వ్రతమాచరిస్తూ.. పాశురాలను రచించింది. ఈ పాశురాలను తిరుప్పావై అని అంటారు. ఈ రోజు తిరుప్పావై 21వ పాశురం.
పాశురము – 21…
ఏట్రకలంగ ళెదిరిపొంగి మీదళిప్ప
మాట్రాదే పాల్ శొరియుమ్ వళ్లల్ పెరుమ్ పశుక్కల్
ఆట్ర ప్పడైత్తాన్ మగనే ! యరివురాయ్
ఊట్రముడై యాయ్ ! పెరియాయ్ ! ఉలగినిల్
తోట్రమాయ్ నిన్ర శుడరే ! తుయిలెళాయ్
మాట్రారునక్కు వలితులైన్దు ఉన్ వా శర్కణ్
ఆట్రాదు వన్దు ఉన్నడి పణియు మాప్పోలే
పోట్రియామ్ వన్దోమ్ పుగళ్ న్దు ఏలోరెమ్బావాయ్
అర్థం: పాలను పిడుకుటకై పొదుగల క్రింద ఎన్ని భాండములుంచినను అవన్నియు పొంగి పొరలి పోవునట్లు క్షీరధారలను వర్షించే గోసంపద గల్గిన శ్రీ నందగోపుని కుమారుడవైన ఓ శ్రీకృష్ణా! మేల్కొని మమ్ము కనరా వయ్యా! అప్రతిహత ధైర్య సాహసములను కల్గియును ఆశ్రితపక్షపాతివై, సర్వులకును ఆత్మ స్వరూపుడవైన నీవు యీ భూలోకమునందు అవతరించిన ఉజ్జ్వల రత్న దీపమా! వేద ప్రమాణ ప్రసిద్ధుడా! ఆ వేదము చేతనైనను ఎరుక పడనంతటి మహా మహిమాన్వితుడా! ఈ దీనులను కటాక్షించి మేలుకొనుము. శత్రువులెల్లరు నీ పరాక్రమమునకు తాళజాలక భయపడి నీకు ఓడిపోయి, నీవాకిట నిల్చి, నన్ను శరణుజొచ్చిన రీతిని మేమందరమూ అనన్య ప్రయోజనులమై ‘నీవే తప్ప ఇతః పరంబెరుగ’మని నీ పాదానుదాసులమై వచ్చితిమి. నీ దాసులమైన మేమందరమును నీ దివ్య కల్యాణ గుణ సంకీర్తనము చేయగా వచ్చినాము. నీ దివ్య మంగళ విగ్రహమునకు దివ్య మంగళా శాసనము చేయ నిల్చినాము స్వామీ! నిన్నాశ్రయించి వచ్చిన మమ్ము కరుణించుటకు మేలుకొనుస్వామీ! లేచి రావయ్యా! అని వేడుకొంటున్నారు.
ఇవి కూడా చదవండి: APSRTC Bus: ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. సంక్రాంతికి స్పెషల్ బస్సులు..
Chinese Pigeon: ఒడిశాలో చైనా గూఢాచారి పావురాలు.. వాటి కాలికి పచ్చ కట్లు.. అవేంటో..