Chinese Pigeon: ఒడిశాలో చైనా గూఢాచారి పావురాలు.. వాటి కాలికి పచ్చ కట్లు.. అవేంటో..

పావురాళ్లంటే ప్రేమకు చిహ్నాలు.. పావురాలు రహస్య రాయబారులు.. పావురాలు గూఢాచారులు.. అయితే వాటి కువ కువలు కూడా ఎంతో వినసొంపుగా ఉంటాయి. అలాంటి పావురాలపైనా అనుమానమంటే..

Chinese Pigeon: ఒడిశాలో చైనా గూఢాచారి పావురాలు.. వాటి కాలికి పచ్చ కట్లు.. అవేంటో..
Pigeon With Chinese
Follow us

|

Updated on: Jan 05, 2022 | 8:30 AM

Pigeon with Chinese Badge: పావురాళ్లంటే ప్రేమకు చిహ్నాలు.. పావురాలు రహస్య రాయబారులు.. పావురాలు గూఢాచారులు.. అయితే వాటి కువ కువలు కూడా ఎంతో వినసొంపుగా ఉంటాయి. అలాంటి పావురాలపైనా అనుమానమంటే.. వాటిలో కొన్ని గూఢాచారి పావురాలుంటే.. ఏంటా డౌట్ ఫుల్ పీజియస్ కథేంటో తేల్చే పనిలో పడ్డారు పోలీసులు. ఒడిశాలో తిరుగుతున్న ఈ పావురాలను ముందుగా స్థానికులు గుర్తించారు. వాటి కాలికి ఉన్న ఆ పచ్చ కట్టు ఏంటా అని ఆరా తీశారు. అనుమానం వచ్చిన ఒడిశా వాసులు ఈ పావురాన్ని పట్టి ఆ కాలికున్న కట్టు విప్పి చూశారు. ఆ ట్యాగ్ లో VHF- వైజాగ్ 19742021 అని ముద్రించి ఉంది. స్థానికులిచ్చిన సమాచారం తో పోలీసులు ఈ పావురాన్ని పట్టుకెళ్లారు.

ఇదిలా ఉంటే పూరీ జిల్లా- హరే కృష్ణ పుర్ పంచాయితీలో రహంగిరియా గ్రామస్తులకు సోమవారం దొరికిన పావురం కాలికి.. మరో ఆశ్చర్యకరమైన ట్యాగ్ కనిపించింది. ఇది మరీ షాకింగ్ న్యూస్. దీని కాలికి 37 అనే సంఖ్యతో పాటు.. చైనా లిపితో కూడిన అల్యూమినియం ట్యాగ్ కనిపించింది. మంగళవారం నాడు ఈ పావురాన్ని గుర్తించి.. తమ వెంట పట్టుకు పోయారు పూరీ పోలీసులు.

అసలే సరిహద్దులో చైనా కుట్రలు పన్నుతున్న వేళ.. ఇవి ఏ దేశపు పావురాలు? ఈ విదేశీ పావురాలకు ఇక్కడేం పని? వీటి కాలికున్న ట్యాగ్ లైన్లు ఏం చెబుతున్నాయ్? వైజాగ్ అనే లెటర్స్ ఉన్న పావురాల వరకూ ఓకే. ఇది స్థానికం. మరో పావురానికి చైనా అక్షరాలున్న ట్యాగ్ ఉండటం దేన్ని సూచిస్తోంది? కొంపదీసి ఇదేమైనా గూఢాచారి పావురమా? ఏంటీ లెక్క? అని ఆరా తీస్తున్నారు ఒడిశా పోలీసులు.

ఒక వేళ ఇది చైనా పావురం అయితే.. ఇక్కడ నుంచి ఎలాంటి సంకేతం పంపుతోంది? అల్యూమినియం ట్యాగ్ లో ఏదైనా చైనా మార్క్ స్కెచ్ దాగుందా? పోలీసు విచారణో ఏం తేలనుంది? తెలియాల్సి ఉంది. చైనా తాము ప్రయోగించే రాకెట్ లాంచర్ల దూరాన్ని పరీక్షించేందుకే ఇలా చేస్తోందనే ప్రచారం స్థానికంగా జరుగుతోంది. ఈ పావురాలతో ఏం చేస్తున్నారు. ఇవి ఎవరికి సమాచారం మోసుకుపోతున్నాయి. ఇందులో ఏదో పెద్ద డ్రాగన్ కుట్ర ఉన్నట్లుగా అనుమానిస్తున్నారు స్థానిక నిఘా వర్గాలు.

ఇలాంటి పావురాలు కొన్ని ఇప్పటికే తమ టార్గెట్ రీచ్ అయితే ఎలాంటి ముప్పు పొంచి ఉందో అనే అంశంపై ఫోకస్ పెట్టారు. ఏది ఏమైనా చైనా చేస్తున్న కుట్రలను ముందుగానే గుర్తించకుంటే ప్రమాదాలు భారీ స్థాయిలో ఉండే ఛాన్స్ ఉందని అనుమానిస్తున్నారు.

ఇవి కూడా చదవండి: APSRTC Bus: ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. సంక్రాంతికి స్పెషల్ బస్సులు..

Watch Video: యూపీలో కాంగ్రెస్ మారథాన్‌లో తొక్కిసలాట.. స్కూల్ అమ్మాయిలకు గాయాలు..