AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Covid-19: కరోనాకు కొత్త మందు.. వచ్చేవారం నుంచి మార్కెట్‌లోకి.. ధర కూడా చాలా తక్కువే..!

New Medicine for Covid: భారతీయ ఫార్మాస్యూటికల్ కంపెనీ డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ కోవిడ్-19 కోసం కొత్త ఔషధాన్ని విడుదల చేయబోతోంది. ఈ యాంటీవైరల్ క్యాప్సూల్ పేరు మోల్నుపిరవిర్.

Covid-19: కరోనాకు కొత్త మందు.. వచ్చేవారం నుంచి మార్కెట్‌లోకి.. ధర కూడా చాలా తక్కువే..!
Dr Reddy's Molnupiravir
Venkata Chari
|

Updated on: Jan 05, 2022 | 7:40 AM

Share

New Medicine for Covid: భారతీయ ఫార్మాస్యూటికల్ కంపెనీ డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ కోవిడ్-19 కోసం కొత్త ఔషధాన్ని విడుదల చేయబోతోంది. ఈ యాంటీవైరల్ క్యాప్సూల్ పేరు మోల్నుపిరవిర్. దీని ధర మ్యాన్‌కైండ్ ఫార్మా క్యాప్సూల్స్ ధరతో సమానంగా ఉంటుంది. డాక్టర్ రెడ్డీస్ తన బ్రాండ్ పేరు మోల్‌ఫ్లూతో క్యాప్సూల్స్‌ను విడుదల చేయనుంది. భారతదేశంలోని మొత్తం 13 కంపెనీలు మోల్నుపిరావిర్‌ను తయారు చేయనున్నాయని ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా గత వారం తెలిపారు.

పూర్తి కోర్సు ధర రూ. 1400.. డాక్టర్ రెడ్డీస్ ప్రకారం – మోల్‌ఫ్లూ ఒక్కో క్యాప్సూల్ ధర రూ. 35గా ఉంది. ఒక స్ట్రిప్‌లో 10 క్యాప్సూల్స్ ఉంటాయి. రోగి 5 రోజులలో 40 క్యాప్సూల్స్ తీసుకోవాలి. దీంతో మొత్తం కోర్సు ఖర్చు రూ. 1,400 అవుతుంది. కోవిడ్-19 రోగులకు అందుబాటులో ఉన్న అత్యంత సరసమైన చికిత్స ఎంపికలలో ఇది ఒకటిగా నిలవనుంది. USFDA-ఆమోదించిన నిబంధనలతోనే Molflu తయారు చేశారు.

వచ్చే వారం నుంచి మోల్‌ఫ్లూ అందుబాటులోకి.. వచ్చే వారం నుంచి ఇది మార్కెట్‌లో అందుబాటులోకి ఉంటుంది. మోల్‌ఫ్లూ దేశవ్యాప్తంగా ఉన్న ఫార్మసీలలో అందుబాటులో ఉంటుందని డాక్టర్ రెడ్డీస్ తెలిపింది. ఈ సంవత్సరం ప్రారంభంలో, డాక్టర్ రెడ్డీస్ భారతదేశంతోపాటు 100 కంటే ఎక్కువ మధ్య-ఆదాయ దేశాలలో mollupiravir తయారీ, సరఫరా చేయడానికి Merck Sharp Dohmeతో నాన్-ఎక్స్‌క్లూజివ్ స్వచ్ఛంద లైసెన్సింగ్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది.

డాక్టర్ రెడ్డీస్‌తో పాటు, 13 భారతీయ ఫార్మాస్యూటికల్ కంపెనీలు మ్యాన్‌కైండ్ ఫార్మా, టోరెంట్ ఫార్మా, సిప్లా, సన్ ఫార్మా, నాట్కో, మైలాన్, హెటెరోతో సహా 13 భారతీయ ఫార్మాస్యూటికల్ కంపెనీలు ఈ మందును తయారు చేస్తున్నాయి. ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం, మ్యాన్‌కైండ్ ఫార్మా యాంటీవైరల్ క్యాప్సూల్ మోలులైఫ్ ధర కూడా రూ. 35గానే ఉంది. మోల్నుపిరావిర్ తేలికపాటి నుంచి మితమైన రోగుల చికిత్సలో ఉపయోగించడానికి ఆమోదించారు.

Also Read: ONGC: ఓఎన్‌జీసీలో తొలి మహిళా చీఫ్‌.. కంపెనీ పగ్గాలు చేపట్టిన అల్కా మిట్టల్‌ ఎవరో తెలుసా?

Karnataka: కర్ణాటకలో పెరిగిన ఒమిక్రాన్ కేసులు.. వారాంతపు కర్ఫ్యూ అమలుకు నిర్ణయం..