Karnataka: కర్ణాటకలో పెరిగిన ఒమిక్రాన్ కేసులు.. వారాంతపు కర్ఫ్యూ అమలుకు నిర్ణయం..
కర్ణాటకలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఒమిక్రాన్ వేరియంట్ కేసులు పెరుగుతుండడంతో కన్నడ రాష్ట్ర సర్కార్ వారాంతపు కర్ఫ్యూ విధించాలని నిర్ణయించింది...
కర్ణాటకలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఒమిక్రాన్ వేరియంట్ కేసులు పెరుగుతుండడంతో కన్నడ రాష్ట్ర సర్కార్ వారాంతపు కర్ఫ్యూ విధించాలని నిర్ణయించింది. కేరళ, గోవా, మహారాష్ట్ర నుంచి కర్ణాటక వచ్చేవారుRT-PCR పరీక్ష చేయించుకోవాలని స్పష్టం చేసింది.
మంగళవారం నాటికి కర్ణాటకలో కరోనా కేసుల సంఖ్య 2,053కి చేరుకుంది. ఈ శుక్రవారం రాత్రి 10 గంటలకు ప్రారంభమయ్యే వారాంతపు కర్ఫ్యూ సోమవారం ఉదయం 5 గంటల వరకు అమలులో ఉండనుంది. ఇప్పటికే రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంది. కర్ఫ్యూ సమయంలో అవసరమైన సేవలు-ప్రజా రవాణా, హోటళ్లు ఎటువంటి అంతరాయం లేకుండా పనిచేస్తాయని కర్ణాటక ప్రభుత్వం తెలిపింది.
ఆ రాష్ట్ర రెవెన్యూ మంత్రి ఆర్ అశోక్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, “ఒమిక్రాన్ ఐదు రెట్లు పెరుగుతోందని.. మంగళవారం 147 కొత్త వేరియంట్ కేసులు నమోదయ్యాయని చెప్పారు. రాష్ట్రంలో కరోనావైరస్ కేసులు మునుపటితో పోలిస్తే రెండింతలు వేగంగా పెరుగుతున్నాయన్నారు. రాష్ట్రంలో వ్యాప్తి చెందకుండా ఉండటానికి మేము కొన్ని మార్గదర్శకాలను తీసుకువచ్చామన్నారు. “రాష్ట్రంలోని కొత్త కేసులలో 85 శాతం బెంగళూరులో ఉన్నాయి. రెండు వారాల పాటు పాఠశాలలు మూసివేస్తున్నాం” అని తెలిపారు.
Read Also.. National Flag in Galwan: చైనాకు ధీటుగా భారత ఆర్మీ సమాధానం.. గాల్వన్ లోయలో త్రివర్ణ పతాకం రెపరెపలు