National Flag in Galwan: చైనాకు ధీటుగా భారత ఆర్మీ సమాధానం.. గాల్వన్ లోయలో త్రివర్ణ పతాకం రెపరెపలు
నూతన సంవత్సర వేడుకల సందర్భంగా సైనికులు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసినట్లు భారత ఆర్మీ వర్గాలు తెలిపాయి.
Indian Army unfurls National flag in Galwan: చైనా దుష్ప్రచారానికి భారత్ మరోసారి ధీటుగా సమాధానం ఇచ్చింది. వాస్తవానికి, చైనా సైనికులు జెండాను ఎగురవేసిన వీడియో వైరల్ కావడంతో కొన్ని భారతీయ సైనికుల చిత్రాలు తెరపైకి వచ్చాయి. ఇందులో భారత సైనికులు నూతన సంవత్సరం సందర్భంగా గాల్వన్‌లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తూ కనిపించారు. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా సైనికులు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసినట్లు భారత ఆర్మీ వర్గాలు తెలిపాయి. భారత సైన్యం త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిందన్న వార్తలు వెలువడిన తరుణంలో గల్వాన్ లోయలో చైనా జెండాను ఎగురవేస్తోందని మీడియాలో వార్తలు వచ్చాయి. అరుణాచల్ ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలకు చైనా కొత్త పేర్లను పెట్టినట్లు గతంలో వార్తలు వచ్చాయి. వివాదాస్పద భూ సరిహద్దు చట్టం అమలుకు ముందే చైనా ఈ చర్య పాల్పడింది.
ఈ వార్తలపై గురువారం కేంద్ర ప్రభుత్వం స్పందిస్తూ, ‘అరుణాచల్‌లోని కొన్ని ప్రాంతాలకు చైనా పేరు మార్చినట్లు కొన్ని మీడియా కథనాల ద్వారా మాకు నివేదికలు అందాయి. కానీ పేరు మార్చడం వల్ల వాస్తవం మారదు. అరుణాచల్ ప్రదేశ్ ఎల్లప్పుడూ భారతదేశంలో అంతర్భాగంగా ఉంది. అలాగే కొనసాగుతుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి తెలిపారు. “చైనా 2017లో కూడా అలాంటి చర్య పాల్పడింది” అని అన్నారు. 2020లో గాల్వన్ వ్యాలీలోనే భారత్, చైనా సైనికుల మధ్య ఘర్షణ జరిగింది. ఇందులో 20 మంది భారత జవాన్లు వీరమరణం పొందారు. అటు 40 మందికి పైగా చైనా సైనికులు కూడా మరణించారు.
ఇప్పుడు ఈ గాల్వన్ వ్యాలీలో భారత సైనికులు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయడం చైనాకు తగిన గుణపాఠం చెప్పినట్లైంది. గాల్వాన్ లోయలో ఇరు దేశాల సైనికుల మధ్య జరిగిన ఘర్షణ తర్వాత పరిస్థితి మారిపోయింది. రెండు దేశాల మధ్య అనేక రౌండ్ల చర్చలు జరిగాయి. ఆ తర్వాత చైనా అనేక రంగాల నుండి తన దళాల మోహరింపును ఉపసంహరించుకుంది. ముఖ్యంగా, రెండు దేశాల మధ్య చాలా కాలంగా ఉద్రిక్తతలు కొనసాగుతున్న డెప్సాంగ్, హాట్ స్ప్రింగ్స్ నుండి చైనా దళాల ఉపసంహరణ జరిగింది. సరిహద్దు పరిస్థితిని చైనా వైపు నుంచి ఏకపక్షంగా మార్చే ప్రయత్నం జరుగుతోందని, ఇదే వివాదానికి కారణమని భారత ప్రభుత్వం చాలాసార్లు చెప్పింది.
Indian Army soldiers in Galwan Valley on #NewYear
(Photo credit: Sources in security establishment) pic.twitter.com/GJxK0QOW48
— ANI (@ANI) January 4, 2022
వాస్తవ సరిహద్దు రేఖ వెంబడి 10 సరిహద్దు పాయింట్ల వద్ద భారత్, చైనా సైన్యాలు పరస్పరం స్వీట్లు పంచుకున్నాయి. తూర్పు లడఖ్‌లో రెండు దేశాల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తత దృష్ట్యా, ఈ పరిణామం చోటుచేసుకోవడం శుభసూచికమని సైనిక నిపుణులు అభిప్రాయపడ్డారు. అయితే, ఈ సమయంలో పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి చెందిన సైనికులు గాల్వాన్‌లో జెండాను ఎగురవేస్తున్నట్లు చూపించిన వీడియోను కూడా చైనా మీడియా విడుదల చేసింది.