JP Nadda on CM KCR: మంత్రులు, ఎమ్మెల్యేల ర్యాలీలు, కార్యక్రమాలకు లేని రూల్స్.. బండి సంజయ్‌కి ఎందుకుః జేపీ నడ్డా
ప్రజాస్వామ్య పరిరక్షణ ర్యాలీ కోసం BJP పట్టు.! కరోనా నిబంధనల దృష్ట్యా కుదరదన్న పోలీసులు. దాదాపు 3 గంటల పాటు హైవోల్టేజ్ టెన్షన్.! చివరికి ఆంక్షలతో కూడిన అనుమతి రావడంతో ర్యాలీ నిర్వహించకుండా గాంధీ విగ్రహానికి నివాళులు అర్పించారు BJP జాతీయ అధ్యక్షుడు JP నడ్డా.
JP Nadda fire on CM KCR: శంషాబాద్ ఎయిర్‌పోర్టు టూ సికింద్రాబాద్ MG రోడ్..! ప్రజాస్వామ్య పరిరక్షణ ర్యాలీ కోసం BJP పట్టు.! కరోనా నిబంధనల దృష్ట్యా కుదరదన్న పోలీసులు. దాదాపు 3 గంటల పాటు హైవోల్టేజ్ టెన్షన్.! చివరికి ఆంక్షలతో కూడిన అనుమతి రావడంతో ర్యాలీ నిర్వహించకుండా గాంధీ విగ్రహానికి నివాళులు అర్పించారు BJP జాతీయ అధ్యక్షుడు JP నడ్డా.
తెలంగాణలో నియంతృత్వ పాలన సాగుతోందని భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా మండిపడ్డారు. మంగళవారం ఆయన బీజేపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రెండు రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో జరిగిన పరిణామాలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేలా ఉన్నాయని నడ్డా ధ్వజమెత్తారు. తెలంగాణలో అవినీతి, కుటుంబ పాలన నడుస్తోంది. తెలంగాణలో ప్రజాస్వామ్య వ్యతిరేక ప్రభుత్వం నడుస్తోంది. బండి సంజయ్‌పై పోలీసులు దురుసుగా ప్రవర్తించారని నడ్డా నిప్పులు చెరిగారు. దుబ్బాక, హుజురాబాద్ ఓటమిని కేసీఆర్ జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని ఆరోపించారు. తెలంగాణ ఉద్యోగుల ఆందోళనకు మద్దతు తెలిపేందుకే వచ్చానని జేపీ నడ్డా స్పష్టం చేశారు. ఉద్యోగులు, ఉపాధ్యాయుల పక్షాన బీజేపీ పోరాడుతుందన్నారు. మాది క్రమశిక్షణ గల పార్టీ. కరోనా నిబంధనలు పాటిస్తూ నిరసన తెలిపామన్నారు. నన్ను ఎయిర్‌పోర్ట్ దగ్గరే అడ్డుకున్నారు. కరోనా నిబంధనలు ఉన్నాయంటూ పోలీసులు చెప్పారు. నిబంధనలు పాటిస్తూనే గాంధీజీకి నివాళులర్పిస్తానని పోలీసులకు చెప్పాను.
‘కేసీఆర్‌తో పోరాడేది కేవలం బీజేపీయే అన్న నడ్డా.. 317 జీవో సవరించే వరకు బీజేపీ పోరాడుతుందన్నారు. తెలంగాణలో మంత్రులు ర్యాలీలు, కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. శాంతియుతంగా జాగరణ దీక్ష చేపడితే పోలీసులు బండి సంజయ్ పై మ్యాన్ హ్యాండిల్ చేశారు. కేసీఆర్ తీరుపై సిగ్గుపడుతున్నామన్నారు. వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్టుగా ఉంది కేసీఆర్ తీరు. బండి సంజయ్ అరెస్ట్‌ను జాతీయ పార్టీ ఖండిస్తుంది.. ప్రజాస్వామ్య యుతంగా పోరాటం చేస్తామని’’ జేపీ నడ్డా అన్నారు.
హైదారాబాద్ అడ్డాలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా టూర్ టెన్షన్ క్రియేట్ చేసింది. సాయంత్రం 5 గంటల నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ వద్ద రచ్చ మొదలైంది. పోలీసుల ఆంక్షల మధ్యే నగరంలో అడుగు పెట్టారు నడ్డా. ఆయన ఎయిర్‌పోర్టులో దిగిన దగ్గరి నుంచి సికింద్రాబాద్‌లో గాంధీ విగ్రహానికి నివాళులర్పించే వరకు హై వోల్టేజ్ కొనసాగింది. పోలీసులు అనుమతి లేదని చెప్పినా ముందుకే సాగారు నడ్డా.Spot… జీవోనెంబర్ 317పై జాగరణ దీక్ష చేపట్టిన బండి సంజయ్‌ను అరెస్ట్ చేశారు పోలీసులు. నిరసనగా ప్రజాస్వామ్య పరిరక్షణ ర్యాలీకి పిలుపునిచ్చింది BJP. ఇందుకోసం ఢిల్లీ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు జేపీ నడ్డా. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సహా పలువురు నేతలు లోపలకు వెళ్లి ఆయనకు స్వాగతం పలికారు. అప్పటికే అక్కడికి పెద్దయెత్తున చేరుకున్నారు పోలీసులు . నడ్డా బయటకు రాగానే కరోనా ఆంక్షల జీవోను చూపించారు జాయింట్ సీపీ కార్తికేయ. సభలకు, సమావేశాలకు అనుమతి లేదని వివరించారు.
దాదాపు అరగంటపాటు ఎయిర్‌పోర్టులో హైటెన్షన్ నెలకొంది. లాంజ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడారు జేపీ నడ్డా. కరోనా ఆంక్షలు పాటిస్తానని, ప్రజాస్వామ్యబద్ధంగా గాంధీ విగ్రహం దగ్గరకు వెళ్లి తీరతానని స్పష్టం చేశారు. తన ప్రజాస్వామ్య హక్కును కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని, అందుకు పోలీసులే ఏర్పాట్లు చేయాలని సూచించారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి తన కాన్వాయ్‌లో నేరుగా సికింద్రాబాద్ ప్యారడైజ్‌కు చేరుకున్నారు నడ్డా. అప్పటికే అక్కడికి బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున వచ్చారు. గాంధీ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు జేపీ నడ్డా. కిషన్‌రెడ్డి, తరుణ్‌చుగ్, లక్ష్మణ్ సహా కొందరు నేతలకే అనుమతి ఇచ్చారు. బండి సంజయ్‌ని అన్యాయంగా అరెస్ట్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోవిడ్ నిబంధనల దృష్ట్యా ర్యాలీ చేపట్టలేదు జేపీ నడ్డా. గాంధీ విగ్రహానికి నివాళులు అర్పించిన తర్వాత నేరుగా బేజేపీ ఆఫీసుకు వెళ్లిపోయారు.