Telangana Covid-19: రాష్ట్రంలో కరోనా విజృంభణ.. ఒక్కరోజే 1,052 కేసులు.. జీహెచ్ఎంసీ పరిధిలోనే 659 నమోదు!
Telangana Corona: తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి మరోసారి వికృత రూపం దాల్చుతోంది. కొత్త కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి.
Telangana Coronavirus Cases: తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి మరోసారి వికృత రూపం దాల్చుతోంది. కొత్త కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఓ వైపు ఒమిక్రాన్ వేరియంట్ భయపెడుతుంటే కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. వారం కింద వరకు రెండొందలు దాటని కరోనా రోజువారీ కేసులు ఇప్పుడు వెయ్యికి పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఆరు నెలల తర్వాత వెయ్యికి పైగా కేసులు వెలుగుచూశాయి. జూన్ తరువాత తొలిసారి 1000 పైగా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 42,991 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 1052 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని వైద్యారోగ్య శాఖ బులెటిన్ వెల్లడించింది.. తాజా కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలోనే 659 కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డిలో 109 కేసులు, మేడ్చల్ మల్కాజిగిరిలో 116 కేసులు రికార్డయ్యాయి.
తాజా కేసులతో మొత్తం ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 6,84,023కి చేరింది. ఇక గత 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో కరోనాతో ఇద్దరు మరణించారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 4,033కి చేరింది. కరోనా బారి నుంచి సోమవారం 240 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 4,858 ఐసోలేషన్, యాక్టివ్ కేసులు ఉన్నాయి.
ఇక గత 24 గంటల వ్యవధిలో ఎట్ రిస్క్ దేశాల నుంచి 127 మంది శంషాబాద్ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. వారందరికీ కరోనా ఆర్‌టీ పీసీఆర్ టెస్టులు చేయగా 10 మంది ప్రయాణికులకు పాజిటివ్‌గా తేలింది. దీంతో అధికారులు వారి నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన ఒమిక్రాన్ కేసుల సంఖ్య 94కి చేరింది. ఒమిక్రాన్ సోకిన వారిలో 37 మంది కోలుకున్నట్టు వైద్యారోగ్యశాఖ ప్రకటించింది.
Telangana Corona cases on 04.01.2022 Revised Media Bulletin HCF as of 04012022
Read Also…. National Flag in Galwan: చైనాకు ధీటుగా భారత ఆర్మీ సమాధానం.. గాల్వన్ లోయలో త్రివర్ణ పతాకం రెపరెపలు