AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Covid19 Ex-Gratia: కోవిడ్‌తో మరణిస్తే రూ.50వేలు ఎక్స్ గ్రేషియా.. ఇలా దరఖాస్తు చేసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి మిగిల్చిన విషాదం అంతా ఇంత కాదు. వందలాది మంది రాకాసి కోరలకు బలైన కుటుంబాలు వీధినపడ్డాయి.

Covid19 Ex-Gratia: కోవిడ్‌తో మరణిస్తే రూ.50వేలు ఎక్స్ గ్రేషియా.. ఇలా దరఖాస్తు చేసుకోండి!
Covid Ex Gratia
Balaraju Goud
|

Updated on: Jan 04, 2022 | 4:49 PM

Share

Covid19 Ex-Gratia: ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి మిగిల్చిన విషాదం అంతా ఇంత కాదు. వందలాది మంది రాకాసి కోరలకు బలైన కుటుంబాలు వీధినపడ్డాయి. ఈ నేఫథ్యంలో కోవిడ్‌తో చనిపోయినవారి కుటుంబాలకు రూ. 50 వేలు పరిహారంగా చెల్లించాలంటూ జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ(నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ ఎన్‌డీఎంఏ) కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. దీంతో కేంద్ర ప్రభుత్వం అమోదం తెలిపింది. అన్ని రాష్ట్రాలు బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం అందించాలని ఆదేశాలు జారీ చేసింది. ఎస్‌డీఆర్ఎఫ్ విడుదల చేసే పరిహారం నిధులను జిల్లాల విపత్తు నిర్వహణ సంస్థలు(డీడీఎంఏ) ద్వారా బాధితుల కుటుంబ సభ్యులకు పంపిణీ చేస్తారు.

ఈ నేపథ్యంలో అయా రాష్ట్రాలు బాధిత కుటుంబాలకు పరిహారం అందించాలని నిర్ణయించాయి. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో కోవిద్ 19 తో మృతిచెందిన వారి అర్హులైన సమీప కుటుంబ సభ్యులకు రూ. 50 వేల ఎక్స్ గ్రేషియా అందించనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. కోవిద్ తో మరణించిన వారి కుటుంబాలకు రూ. 50 వేలను ఎక్స్‌గ్రేషియాగా అందచేయాలన్న కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం, ఈ పరిహారం పొందేందుకు మీసేవా కేంద్రాల ద్వారా దరకాస్తులను దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వ విపత్తుల నివారణ శాఖ తెలిపింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది.

2020లో దేశంలో తొలి కోవిడ్ మరణం నమోదైనప్పటి నుంచి ఈ వైరస్ బారిన పడి చనిపోయిన వారికి ఇది వర్తిస్తుంది. మొదటి, రెండు వేవ్‌లలో మరణించినవారితో పాటు భవిష్యత్‌లో అలాంటి తీవ్రమైన వేవ్ మళ్లీ వచ్చి ఎవరైనా మరణించినా వారికీ ఈ పరిహారం వర్తిస్తుంది. పరిహారానికి సంబంధించిన మళ్లీ నోటిఫికేషన్ ఇచ్చే వరకు ఇవే నిబంధనలు అమలులో ఉంటాయని కేంద్రం స్పష్టం చేసింది.

ఇలా దరఖాస్తు చేసుకోవాలిః

కోవిడ్ పరిహారం కోసం రాష్ట్రాలు అందుబాటులో ఉంచే నిర్దేశిత ఫారాలను నింపాలి.

దానికి కోవిడ్‌తో చనిపోయినట్లుగా మరణ ధ్రువీకరణ పత్రం జత చేయాలి.

ఈ దరఖాస్తులను డీడీఎంఏలు పరిశీలించి అర్హత ఉందని నిర్ధరిస్తే వారికి పరిహారం అందుతుంది.

దరఖాస్తు చేసుకున్న 30 రోజుల్లోగా క్లెయింలు పరిష్కరించాల్సి ఉంటుంది.

పరిహారానికి అర్హత ఉందని డీడీఎంఏ నిర్ధరిస్తే, 30 రోజుల్లోగా అర్హుల బ్యాంకు ఖాతాకు ప్రత్యక్షంగా నగదు బదిలీ అవుతుంది.

ఇందుకోసం బ్యాంకు ఖాతాకు ఆధార్ సంఖ్య అనుసంధానమై ఉండాలి.

కోవిద్ 19 తో మృతి చెందినట్టు అఫీషియల్ డాక్యుమెంట్, ఇతర ధృవపత్రాలతో రాష్ట్రంలోని 4,500 మీసేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది. ఈ దరఖాస్తులో బ్యాంక్ అకౌంట్ వివరాలు, ఇతర అవసరమయ్యే డాక్యుమెట్లను జత పరచి మీ సీవా కేంద్రాల ద్వారా పంపాల్సి ఉంటుంది. జిల్లా కలెక్టర్ చైర్మన్‌గా, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి, జిల్లా కేంద్రంలోని ఆసుపత్రి సూపరింటెండెంట్ లు సభ్యులుగా ఉండే కోవిద్ డెత్ నిర్దారణ కమిటీ, కోవిద్ 19 మరణానికి సంబంధించి అధికారిక ధ్రువీకరణ పత్రాన్ని జారీ చేస్తుందని, దీని అనంతరం ఎక్స్ గ్రేషియా మరణించిన వారి సమీప బంధువుల అకౌంట్లలో జమ చేయడం జరుగుతుందని పేర్కొంది. ఇతర వివరాలకు మీసేవా ఫోన్ నెంబర్ 040 48560012 అనే నెంబర్ కు గానీ, meesevasupport @telangana.gov.com అనే మెయిల్ కు సంప్రదించాలని డిజాస్టర్ మేనేజ్ మెంట్ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

Covid Exgratia

Covid Exgratia

Read Also… Will Impose Lockdown Omicron Tension: భయం గుప్పెట్లో భారత్ ? మళ్ళీ ‘లాక్ డౌన్’ వైపు అడుగులు..(వీడియో)