Medical College Raging: మెడికల్ కాలేజీ ర్యాగింగ్ ఘటనలో మరో ట్విస్ట్.. పోలీసుల విచారణలో వెలుగులోకి సంచలనాలు!
Medico Raging: సూర్యాపేట ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ అంశం సీరియస్‌గా తీసుకున్న పోలీసులు విచారణ వేగవంతం చేశారు. కమిటీ నివేదికలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
Suryapet Medical College Raging: సూర్యాపేట ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ అంశం సీరియస్‌గా తీసుకున్న పోలీసులు విచారణ వేగవంతం చేశారు. కమిటీ నివేదికలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. జూనియర్లపై జరిగింది ర్యాగింగ్ కాదని కేవలం నూతన సంవత్సరం వేడుకల్లో ఘర్షణగా తేల్చింది ప్రత్యేక విచారణ కమిటీ. కమిటీ నివేదిక ఇలా ఉంటే నిన్న పోలీసులు మాత్రం ర్యాగింగ్ జరిగినట్లు ప్రాథమిక ఆధారాలు సేకరించినట్లు వెల్లడించారు. ఇరువురి పరస్పర విరుద్ధ ప్రకటనలతో ర్యాగింగ్ అంశం పక్కదారి పడుతున్నట్లు విద్యార్ధి సంఘాలు ఆరోపిస్తున్నాయి. అయితే, ప్రత్యేక విచారణ కమిటీ నివేదికతో ఆరుగురు విద్యార్థులపై ఏడాదిపాటు వేటు పడింది.
సూర్యాపేట ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ అంశం కలకలం రేపిన సంగతి తెలిసిందే. జనవరి ఒకటి తేదీ రాత్రి హాస్టల్ ఆవరణలో మద్యం మత్తులో రెండు గంటల పాటు పిడిగుద్దులు గుద్ది, నిర్బంధించి సీనియర్లు ర్యాగింగ్‌కు పాల్పడ్డారంటూ మొదటి సంవత్సరం మెడికోలు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో మంత్రి హరీష్ రావు స్పందించి విచారణకు ఆదేశించారు. మంత్రి ఆదేశాలతో నలుగురు హెచ్ఓడీలతో ప్రత్యేక విచారణ కమిటీని కాలేజీ అధికారులు నియమించారు. కమిటీ నివేదికను ఈ రోజు ఉన్నతాధికారులకు అందించారు. మెడికోల మధ్య జరిగింది ర్యాగింగ్ కాదని కేవలం ఘర్షణగా తేల్చారు. ఈ ఘటనలో ఆరుగురు విద్యార్థులను ఒక సంవత్సరం పాటు సస్పెండ్ చేయడంతో పాటు శాశ్వతంగా హాస్టల్ నుంచి సస్పెండ్ చేయాలని డిఎంఈ రమేష్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.
ర్యాగింగ్ ఘటనపై పోలీసులు మాత్రం తమ విచారణలో ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు మాత్రం ర్యాగింగ్ జరిగినట్లుగా ప్రాథమికంగా నిర్ధారించినట్లు తెలిపారు. ర్యాగింగ్‌కు పాల్పడినట్లు భావిస్తున్న విద్యార్థులపై పోలీసులు యాంటీ ర్యాగింగ్ యాక్ట్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. మరో 13 మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
రాగింగ్ జరగలేదని విచారణ కమిటీ నివదికతో ఒకవైపు, మరో వైపు పోలీసులు ప్రకటన బాధిత విద్యార్థిని అయోమయంలో పడ్డారు. తనను సీనియర్స్ మూడు గంటల పాటు నిర్బంధించి మానసికంగా హింసించారని విద్యార్థి ఆరోపిస్తున్నారు. ఇంటరాక్షన్ పేరుతో సీనియర్స్ ర్యాగింగ్ చేస్తున్నా మేనేజ్మెంట్ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. విచారణ విచారణ కమిటీ, పోలీసుల పర్సపర విరుద్ధ ప్రకటనలతో ర్యాగింగ్ అంశం పక్కదారి పట్టినట్లు భావిస్తున్నారు. ఒక వైపు కాలేజీ యాజమాన్యం చర్యలు మరో వైపు పోలీసుల విచారణ నేపథ్యంలో సీనియర్లు వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. కాలేజీ నుండి ఏడాదిపాటు సస్పెన్షన్ వేటు వేస్తే తమ పిల్లల భవిష్యత్తు ఎలా అని వాపోతున్నారు తల్లి తండ్రులు. సస్పెన్షన్ టెన్షన్ ఇలా ఉంటే పోలీసుల కేసు ఎక్కడికి దారి తీస్తుందోనని తీవ్ర మనోవేదనకు లోనవుతున్నారు విద్యార్థులు వారి తల్లితండ్రులు.
Read Also… Lift Accident: సిద్ధిపేట జిల్లాలో తెగిపడ్డ ఆర్‌వీఎం ఆసుపత్రి లిఫ్టు.. 20మందికి గాయాలు, ముగ్గురికి సీరియస్!