Lift Accident: సిద్ధిపేట జిల్లాలో తెగిపడ్డ ఆర్‌వీఎం ఆసుపత్రి లిఫ్టు.. 20మందికి గాయాలు, ముగ్గురికి సీరియస్!
Medical College Lift fell down: సిద్దిపేట జిల్లాలో జరిగిన లిప్టు ప్రమాదంలో 20మంది గాయపడ్డారు. జిల్లాలోని లక్ష్మక్కపల్లె ఆర్‌వీఎం వైద్య కళాశాలలో ప్రమాదవశాత్తు లిప్టు తెగిపడింది.

Lift Accident
Siddipet Lift Accident: సిద్దిపేట జిల్లాలో జరిగిన లిప్టు ప్రమాదంలో 20మంది గాయపడ్డారు. జిల్లాలోని లక్ష్మక్కపల్లె ఆర్‌వీఎం వైద్య కళాశాలలో ప్రమాదవశాత్తు లిప్టు తెగిపడింది. ఈ ఘటనలో 20మంది గాయపడ్డారు. ఇందులో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయని స్థానికులు తెలిపారు. కళాశాలలో లిఫ్టు తీగలు తెగడంతో ఒక్కసారిగా పైఅంతస్తు నుంచి కిందపడిపోయింది. దీంతో అప్రమత్తమైన స్థానికులు క్షతగాత్రులను హుటాహుటీన ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా, ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం అందాల్సి ఉంది.
