Gold price today: స్థిరంగా బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయంటే..
బులియన్ మార్కెట్‌లో పసిడి ధరల్లో ప్రతిరోజూ మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటాయన్న విషయం అందరికీ తెలిసిందే...
బులియన్ మార్కెట్‌లో పసిడి ధరల్లో ప్రతిరోజూ మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటాయన్న విషయం అందరికీ తెలిసిందే. మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఒక్కోసారి తగ్గితే.. మరికొన్ని సార్లు పెరుగుతుంటాయి. అందుకే కొనుగులుదారులంతా వాటి ధరలవైపు ప్రత్యేకంగా దృష్టిసారిస్తుంటారు. అయితే.. కొన్ని రోజుల నుంచి బంగారం ధరలు పెరుగుతున్నాయి. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భయాలతో బంగారం ధరలపై అధిక ప్రభావం చూపుతుందని, దీని కారణంగా ధరలు పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. బుధవారం(జనవరి 5న) దేశంలోని పలు నగరాల్లో బంగారం ధరలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం..
* దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,050 ఉండగా, అదే 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,330 వద్ద ఉంది. * ఇక దేశ ఆర్థిక రాజధాని అయిన ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,260 ఉండగా, అదే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,260వద్ద కొనసాగుతోంది. * తమిళనాడు రాజధాని చెన్నై నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,170 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,230 వద్ద కొనసాగుతోంది. * పశ్చిమబెంగాల్ రాజధాని కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,100 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,800 వద్ద కొనసాగుతోంది. * కర్ణాటక రాజధాని బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,900 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,990 ఉంది. * కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.44,900 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,990 వద్ద కొనసాగుతోంది.
తెలుగు రాష్ట్రాల్లో ధరలు..
* తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,900 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,990 వద్ద కొనసాగుతోంది. * ఏపీలోని విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.44,900 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,990 వద్ద కొనసాగుతోంది. * విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,900 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,990 వద్ద కొనసాగుతోంది.
Read Also.. LIC: ఎల్ఐసీ ఈ ప్లాన్ లో ప్రతిరోజూ 28 రూపాయల ఆదాతో లక్షలు సంపాదించే అవకాశం.. ఎలానో తెలుసుకోండి!