Bulli Bai Case: బుల్లీ బాయ్‌ యాప్ వెనకున్న సూత్రధారి ఈమెనా? ఇంకెవరైనా ఉన్నారా..?

Bulli Bai Case: బుల్లీ బాయ్‌ యాప్ వెనకున్న సూత్రధారి ఈమెనా? ఇంకెవరైనా ఉన్నారా..?
Bulli Bai

ఆన్‌లైన్‌లో మహిళల వేలం. దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపిన బుల్లీ బాయ్‌ యాప్‌ కేసులో ముంబై కాప్స్‌ కౌంటర్ స్టార్ట్ చేశారు. యాక్షన్‌లోకి దిగి అరెస్టులు మొదలుపెట్టారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉన్న..

Sanjay Kasula

| Edited By: Janardhan Veluru

Jan 05, 2022 | 10:25 AM

దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపిన బుల్లీ బాయ్‌ యాప్‌ కేసులో ముంబై పోలీసులు కౌంటర్ స్టార్ట్ చేశారు. యాక్షన్‌లోకి దిగి అరెస్టులు మొదలుపెట్టారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉన్న 100 మంది ముస్లిం మహిళలపై కుట్ర పన్నిన నిందితురాలిని ఉత్తరాఖండ్‌లో అరెస్టు చేసి ముంబైకి తరలించారు. ఈ కేసులో మరో నిందితుడు 21 ఏళ్ల ఇంజనీర్ కూడా అరెస్టయ్యాడు. వారిద్దరూ కలిసి ఈ మొత్తం రాకెట్ (బుల్లి బాయి యాప్ కేసు)ను నడిపారని పోలీసులు అనుమానిస్తున్నారు. అంతకుముందు మరో డీల్స్ కూడా వారిద్దరి ఆలోచనలే అని అనుమానిస్తున్నారు. దర్యాప్తులో, పోలీసులకు నేపాలీ అబ్బాయి గురించి కూడా ఉన్నట్లుగా సమాచారం వచ్చింది.

మీడియా కథనాల ప్రకారం.. బుల్లీ బాయ్‌ యాప్ సూత్రధారి, మెయిన్ అక్యూజ్డ్‌ లేడీ… ఇందులో మూడు ఖాతాలను నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. బెంగళూరులో అరెస్టైన విశాల్‌కు, ఈమెకు సంబంధాలు ఉన్నాయని తెలిపారు. విశాల్‌కు కూడా ఖల్సా సుప్రీమాసిస్ట్‌ పేరుతో ఆమే అకౌంట్‌ క్రియేట్‌ చేసినట్లు తేలింది. నిందితుడి తరపున అనేక ఖాతాలను తెరిచిన ప్రధాన నిందితురాలు.. వాటికి సిక్కు పేర్లను పెట్టింది.

బుల్లీ బాయ్‌ యాప్‌ కేసులో ఇప్పటివరకు ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఓ వర్గం మహిళలను టార్గెట్‌గా చేసుకుని ఈ యాప్‌ను సృష్టించారు. వందలాది మంది మహిళల ఫొటోలను అప్‌లోడ్ చేసి వేలానికి పెట్టడం సంచలనమైంది. ఓ మహిళా జర్నలిస్ట్‌ ఫొటో కూడా అందులో ఉండటంతో ఈ బుల్లీ బాయ్ వ్యవహారంలో వెలుగులోకి వచ్చింది.

రాజకీయంగా పెను దుమారం రేగడంతో ముంబై కాప్స్‌ యాక్షన్‌లోకి మాస్టర్‌ మైండ్‌ను అరెస్ట్‌ చేశారు. ఈ యాప్‌ వెనకున్న సూత్రధారి ఈమెనా? లేక అసలు మాస్టర్‌ మైండ్‌ ఇంకేవరైనా ఉన్నారా? ఈ యాప్ టార్గెట్‌ అల్లరిపాలు చేయడమేనా? ఇంకేదైనా ఉందా? అనేది తేలాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి: APSRTC Bus: ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. సంక్రాంతికి స్పెషల్ బస్సులు..

Chinese Pigeon: ఒడిశాలో చైనా గూఢాచారి పావురాలు.. వాటి కాలికి పచ్చ కట్లు.. అవేంటో..

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu