Inspiration Video: పేపర్ బాయ్ టూ ప్రెసిడెంట్, టెన్త్ పెయిల్ టూ క్రికెటర్, చాయ్ వాలా టూ ప్రధాని..(వీడియో)

Inspiration Video: పేపర్ బాయ్ టూ ప్రెసిడెంట్, టెన్త్ పెయిల్ టూ క్రికెటర్, చాయ్ వాలా టూ ప్రధాని..(వీడియో)

Anil kumar poka

|

Updated on: Jan 06, 2022 | 9:27 AM

చదువులు విద్యార్థుల చావుకొస్తున్నాయా..? నిజంగానే చంపేస్తున్నాయా? అసలు మార్కులు రాకుంటే మునిగిపోయేదేంటి..? ఏదో జరిగిపోతుందని ఎందుకు అక్కడే ఆగిపోతున్నారు? అసలు చావు వెనుక నిజం ఏంటి?… నిజంగా.. విద్యార్థులవి ఆత్మహత్యలు కాదా.. హత్యలేనా?


చదువులు విద్యార్థుల చావుకొస్తున్నాయా..? నిజంగానే చంపేస్తున్నాయా? అసలు మార్కులు రాకుంటే మునిగిపోయేదేంటి..? ఏదో జరిగిపోతుందని ఎందుకు అక్కడే ఆగిపోతున్నారు? అసలు చావు వెనుక నిజం ఏంటి?… నిజంగా.. విద్యార్థులవి ఆత్మహత్యలు కాదా.. హత్యలేనా? ఆలోచిస్తేనే ఆశ్చర్యమేస్తుంది. అంతలా విద్యార్థులు మానసికంగా సంఘర్షణకు లోనవుతున్నారా? కన్నవాళ్ల చదువుల ఒత్తిడి.. కాలేజీ యజమాన్యాల టార్చర్‌తో సగటు విద్యార్థి మినీ యుద్ధమే చేస్తున్నాడా?.. అంటే కొన్ని వర్గాల నుంచి అవుననే సమాధానం వినిపిస్తుంది. ప్రజల్లో పాజిటివిటి లోపిస్తుంది. యువ ప్రాయంలో విద్యార్థులకి మార్గనిర్దేశనం కరువవుతోంది. ఇటు ఇంట్లో.. అటు విద్యాలయాల్లో మంచి జీవిత కథలు.. స్ఫూర్తి రగిలించే వ్యక్తుల చరిత్రను చెప్పేవాళ్లే లేకుండాపోయారు. ఆ లోపమే కొంప ముంచుతుందా అన్న సందేహాలు ఉన్నాయి. పేపర్ బాయ్ నుంచి భారతదేశ ప్రెసిడెంట్‌గా ఎదిగిన.. అబ్దుల్ కలాం.. జీవితం ఎందరికో ఆదర్శనీయం. సచిన్‌ టెండూల్కర్‌.. టెన్త్ ఫెయిలయ్యాడు. కానీ అక్కడితో ఆగిపోలేదు. తనకు ఎక్కడ ఇంట్రెస్ట్‌ ఉందో అది పట్టేశాడు. ఆ తర్వాత సచిన్‌ యువతరానికి ఓ ఐకాన్‌ స్టార్‌. ఓ రోల్‌ మోడల్‌. భారతరత్నలాంటి పురస్కారాన్ని అందుకుని ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా నిలిచాడు. టెన్త్‌ ఫెయిలయ్యాయనని అక్కడే ఆలోచిస్తూ కూర్చుంటే.. మనం ఓ గొప్ప ప్లేయర్‌ని చూసుండేవాళ్లమా?… చదువులో ఫెయిలై.. కెరీర్‌ పరంగా సక్సెస్‌ అయినవాళ్లు ఎంతోమంది ఉన్నారు. అంతేకాదు.. లైఫ్‌లో ఫెయిలైన వాళ్లు సైతం ఉన్నత శిఖరాలకు ఎదిగిన వాళ్లూ ఉన్నారు.

మన జాతిపిత మహత్మగాంధీ చేత కర్రబట్టి బ్రిటీష్‌ వాళ్లని తరిమికొట్టినా.. రాట్నం చేతబట్టి నూలు వడికినా.. చీపురు అందుకుని మురికివాడలు శుభ్రం చేసినా అదే ఒడుపు.. అదే శ్రద్ధ. ఒక్కడుగా మొదలై కోట్లాది మందిని ప్రభావితం చేశారు. రవి అస్తమించని బ్రిటీష్‌ సామ్రాజ్యాన్ని గడగడలాడించారు. బారిస్టర్‌గా మొదట్లో వైఫల్యాలు ఎదురైనా లెక్కచేయలేదు. ఫైనల్‌గా 20వ శతాబ్దంలో స్ఫూర్తివంతమైన నేతగా నిలిచారు.

విజయానికి మన కళ్లముందున్న మరో నిర్వచనం.. ప్రధాని మోదీ. తండ్రితో కలిసి ఛాయ్‌ అమ్మారు. ఈ విషయాన్ని గర్వంగా చెప్పుకుంటారాయన. చెప్పుకోవడానికి డిగ్రీలు, పట్టాల్లేకపోయినా.. లోకాన్ని చదివారాయన. ముఖ్యమంత్రి నుంచి ప్రధాని స్థాయికి చేరుకున్నారు. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన వ్యక్తుల్లో ఒకరిగా నిలిచారు. బిగ్‌ బి అమితాబ్‌ బచ్చన్‌.. సొంత ప్రొడక్షన్‌ హౌస్‌ ఏబీసీఎల్‌తో దివాళా తీశారు. పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయారు. అయినా బూర్జ్‌ ఖలీఫా భవనంలా నిలబడ్డారు. కష్టాలను చిరునవ్వుతో పలకరిస్తూ ముందుకెళ్లారు. కేబీసీ సిరీస్‌ రాకతో కెరీర్‌ 360 డిగ్రీల మలుపు తిరిగింది. బిగ్‌ బి అంటే బాలీవుడ్‌ అనే స్థాయికి వెళ్లారాయన. ధీరుభాయ్ అంబానీ కూడా మనకి రోల్‌మోడలే. చదువును మధ్యలోనే వదిలేసి.. 16ఏళ్లకే యెమన్‌ బాటపట్టారు. పెట్రోల్‌ బంక్‌లో 3వందల రూపాయల జీతానికి పనిచేశారు. ఆర్థిక ఇబ్బందులు, కష్టాల కడలిని దాటి వేల కోట్ల సామ్రాజ్యాన్ని సృష్టించారు.

ఉన్నత శిఖరాలను అధిరోహించిన వాళ్లు చాలామంది ఉన్నారు. అలాగని వాళ్లని చదువు మాత్రమే ఆ స్థాయిలో నిలబెట్టలేదు. చదువు లేకపోయినా వాళ్లలో ఉన్న ఇంట్రస్టు, టాలెంట్‌తో ఎదిగారు. రోల్‌మోడల్‌గా నిలిచారు. అందుకే ర్యాంక్‌ రాలేదనో.. సబ్జెక్ట్‌లో ఫెయిలయ్యారనో అక్కడే ఆగిపోకండి. జీవితం వడ్డించిన విస్తరి కాదు.. ఓటమి, వైఫల్యాన్ని మెట్లుగా మలచుకుంటూ ముందుకెళ్లండి.

Published on: Jan 06, 2022 09:22 AM