Viral Video: బ్యాండ్ బాజాలు, డీజే చప్పుళ్లు.. ఇవన్నీ స్మార్ట్ ఫోన్ ఊరేగింపు కోసమేనా.? వైరల్ అవుతున్న వీడియో..
సాధారణంగా కొత్తగా ఏదైనా వస్తువు కొనుగోలు చేశామంటే ఆ సందర్భాన్ని మధుర క్షణంగా భావిస్తాం. ఆ వస్తువును కొనుగోలు చేసిన రోజు ఎప్పటికీ గుర్తిండిపోయేలా డైరీలో రాసుకోవడం లేదా స్నేహితులకు చిన్న పార్టీ ఇచ్చిన సంబురపడుతుంటాం. అయితే
సాధారణంగా కొత్తగా ఏదైనా వస్తువు కొనుగోలు చేశామంటే ఆ సందర్భాన్ని మధుర క్షణంగా భావిస్తాం. ఆ వస్తువును కొనుగోలు చేసిన రోజు ఎప్పటికీ గుర్తిండిపోయేలా డైరీలో రాసుకోవడం లేదా స్నేహితులకు చిన్న పార్టీ ఇచ్చిన సంబురపడుతుంటాం. అయితే మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ వ్యక్తి చేసిన పని చూస్తే మాత్రం ఆశ్చర్యపోక మానరు. చిన్న సంతోషాన్ని ఎంతో గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్న వ్యక్తి ఇప్పుడు నెట్టింట్ టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారాడు. ఇంతకీ ఆ వ్యక్తి చేసిన పని ఏంటనేగా మీ సందేహం..
వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్‌లోని శివపురికి చెందిన మురారి కుష్వాహా అనే వ్యక్తి టీస్టాల్ నడిపిస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే ఇటీవల తన కూతురు స్మార్ట్ ఫోన్‌ను కొనివ్వమని అడిగింది. అయితే ఫోన్ కొనిచ్చే సమయంలో అందరికీ తెలిసేలా నీ మొబైల్ ఫోన్‌ను ఇంటికి తీసుకొస్తానని కూతురికి మాటిచ్చాడు. దీంతో కూతురి కోరిక మేరకు స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేసిన మురారి కూతురికిచ్చిన మాట మేరకు మొబైల్ షాప్ నుంచి ఇంటి వరకు పెద్ద ర్యాలీ తీశాడు. ఇది అలాంటిలాంటి ర్యాలీ కాదు.గుర్రపు బండిపై కూతరును కూర్చొబెట్టుకొని చేతిలో స్మార్ట్ ఫోన్ పట్టుకొని ఇంటికి తీసుకొచ్చాడు. దారి మధ్యలో డీజే చప్పుళ్ళు, బ్యాండ్ బాజాలతో హంగామా చేశాడు. ముందు ఏదో పెళ్లి బరాత్ అని అనుకున్న ప్రజలు అసలు విషయం తెలిసి షాక్ అయ్యారు. దీనంతటినీ అక్కడ ఉన్న కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
రోజూ వర్షమే.. కానీ గొడుగులు వాడరు ! ఆ వింత గ్రామం స్పెషాలిటీ ఇదే
జపాన్‌లో జీవితంపై ఐఐఎం కాశీపూర్.. పూర్వ విద్యార్థి వీడియో
మొక్కలు సహాయం కోసం అరుస్తాయా?
అమెరికాలో రూ.1 కోటి జీతం వచ్చినా.. చివరకు మిగిలేదెంత..?
మూడు గుడ్లకు రూ.500! బిల్లు చూసి షాకైన గెస్ట్, వైరల్ వీడియో
నిజాయితీ గెలిచిన ఆటో డ్రైవర్!
భార్యాపిల్లలు ఇంట్లో ఉండగానే.. ఇంటిని కూల్చేసిన భర్త

