APSRTC Bus: ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. సంక్రాంతికి స్పెషల్ బస్సులు..

ప్రయాణికులకు ఏపీఎస్‌ ఆర్టీసీ గుడ్‌న్యూస్ చెప్పింది. సంక్రాంతి సందర్బంగా స్పెషల్ బస్సులను నడపనున్నట్లుగా ప్రకటించింది. సంక్రాంతి సమీపిస్తున్న తరుణంలో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది పడకుండా..

APSRTC Bus: ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. సంక్రాంతికి స్పెషల్ బస్సులు..
Aps Rtc
Follow us
Sanjay Kasula

|

Updated on: Jan 05, 2022 | 8:10 AM

APSRTC Special Bus Services: ప్రయాణికులకు ఏపీఎస్‌ ఆర్టీసీ గుడ్‌న్యూస్ చెప్పింది. సంక్రాంతి సందర్బంగా స్పెషల్ బస్సులను నడపనున్నట్లుగా ప్రకటించింది. సంక్రాంతి సమీపిస్తున్న తరుణంలో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది పడకుండా ఏపీఎస్‌ ఆర్టీసీ రెడీ అవుతోంది. భారీ సంఖ్యలో ప్రత్యేక బస్సు సర్వీసులను నడిపేందుకు సిద్ధమవుతోంది. ఈ సంక్రాంతి మొదలు.. ఆ తర్వాత కలిపి మొత్తం 6,970 స్పెషల్ బస్స్ సర్వీసులను నడనున్నట్లుగా ప్రకటించింది. వాటిలో పండగ ముందు 4,145 ప్రత్యేక సర్వీసులు.. పండగ తరువాత తిరిగి వెళ్లేవారి కోసం మరో 2,825 ప్రత్యేక సర్వీసులు నడిపేందుకు ప్లాన్ చేసింది. గత ఏడాది కంటే 35 శాతం అధికంగా ఈ ఏడాది ప్రత్యేక బస్సులు నడపాలని డిసైడ్ అయ్యింది.

మొత్తం నడుపుతున్నవాటిలో సంక్రాంతికి ముందు జనవరి 8 నుంచి 14 వరకు 4,145 ప్రత్యేక బస్సులు నిర్వహిస్తుంది. వీటిలో అధికంగా హైదరాబాద్‌ నుంచే నడిపిస్తోంది. వాటిలో 1,500 బస్‌ సర్వీసులను హైదరాబాద్ నుంచి వచ్చేవారి కోసం అని తెలిపింది. ఇక విశాఖపట్నానికి 650, విజయవాడకు 250, బెంగళూరుకు 100, చెన్నైకి 45 సర్వీసులు నడుపుతున్నారు. మిగిలిన 1,600 సర్వీసులు అన్ని జిల్లా కేంద్రాలతోపాటు ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన పట్టణాలకు కేటాయించారు.గత ఏడాది సంక్రాంతి ముందు మొత్తం 2,982 ప్రత్యేక బస్సులే ఆర్టీసీ నడిపింది. ఈసారి 1,163 సర్వీసులను అధికంగా కేటాయించింది. అయితే ఈ ఏడాది వాటి సంఖ్యను భారీగా పెంచింది.

పండగ ముగించుకుని..

పండుగ తర్వాత స్వంత గ్రామాల నుంచి తిరుగు ప్రయాణమయ్యే వారి కోసం కూడా తగినన్ని ప్రత్యేక బస్సు సర్వీసులను ఆర్టీసీ ఏర్పాటు చేసింది. ఇందులో తిరుగు ప్రయాణం అంటే జనవరి 15 నుంచి 17 వరకు 2,825 ప్రత్యేక బస్సులు నడిపిస్తోంది. వాటిలో హైదరాబాద్‌కు అత్యధికంగా 1,000 బస్సులను కేటాయించారు.  విశాఖపట్నానికి 200, విజయవాడకు 350, బెంగళూరుకు 200, చెన్నైకు 75 బస్సులతోపాటు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు వెయ్యి ప్రత్యేక బస్సులు నిర్వహిస్తారు. గతేడాది సంక్రాంతి తరువాత 2,151 ప్రత్యేక బస్సులు నిర్వహించారు. ఈ ఏడాది 674 బస్సులను అధికంగా కేటాయించారు. స్వంత వాహనాల్లో ప్రయాణించే కంటే ఆర్టీసీలో ప్రయాణించడం సురక్షితం అని ఆర్టీసీ సూచిస్తోంది.

ఇవి కూడా చదవండి: PM Modi: త్రిపుర ప్రజలకు మూడు వరాలు ప్రకటించిన ప్రధాని.. పేదరికం, వెనుకబాటుతనానికి త్వరలో విముక్తిః మోడీ

Health: వెన్నునొప్పి తరుచుగా వస్తుందా.. అయితే అది క్యాన్సర్ లక్షణం కావొచ్చు..