Andhra Pradesh – Accident: కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. మహిళను ఢీకొట్టి ఆగకుండా వెళ్లిన పోలీస్ వాహనం..

Andhra Pradesh - Accident: కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. మహిళను ఢీకొట్టి ఆగకుండా వెళ్లిన పోలీస్ వాహనం..

Andhra Pradesh - Accident: కృష్ణా జిల్లా పామర్రు మండలం జుఝువరం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పోలీస్ ఎస్కార్ట్ వాహనం డీకొని బేబిమ్మ(60) అనే మహిళ మృతి చెందింది.

Shiva Prajapati

|

Jan 05, 2022 | 8:03 AM

Andhra Pradesh – Accident: కృష్ణా జిల్లా పామర్రు మండలం జుఝువరం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పోలీస్ ఎస్కార్ట్ వాహనం డీకొని బేబిమ్మ(60) అనే మహిళ మృతి చెందింది. అయితే, బేబిమ్మను ఢీ కొట్టిన పోలీస్ వాహనం ఆగకుండా వెళ్లిపోవటంతో గ్రామస్తులు, కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడ – మచిలీపట్నం రహదారిపై ధర్నాకు దిగారు గ్రామస్థులు. దాంతో రహదారికి ఇరువైపులా వాహనాలు భారీగా నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఉన్నతాధికారులు ఘటన స్థలానికి చేరుకున్నారు. ఆగ్రహించిన గ్రామస్తులు.. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారడంతో.. జిల్లా కలెక్టర్ జె. నివాస్, పోలీస్ ఉన్నతాధికారులు జుఝువరం గ్రామానికి వచ్చారు. ఆందోళన విరమించాల్సిందిగా గ్రామస్తులకు సర్దిచెప్పేందుకు ప్రయత్నించారు కలెక్టర్. బాధిత బెబిమ్మ కుటుంబానికి అన్నివిధాలుగా అండగా ఉంటామని కలెక్టరు హామీ ఇచ్చారు. దాంతో గ్రామస్తులు, బాధితురాలి కుటుంబ సభ్యులు ఆందోళన విరమించారు. జుఝువరం గ్రామంలో ప్రమాదాలు నివారించేలా అండర్ పాస్ నిర్మిస్తామని ఈ సందర్భంగా కలెక్టర్ జె.నివాస్ ప్రకటించారు. కాగా, విషయం తెలుసుకున్న టిడిపి ఇన్చార్జ్ వర్ల కుమార్ రాజ బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.

Also read:

Telangana Intermediate Board: ఇంటర్ పరీక్ష ఫీజుల తేదీలు ఖరారు.. ఫీజు, చివరి తేదీ వివరాలు ఇక్కడ తెలుసుకోండి..

APSRTC Bus: ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. సంక్రాంతికి స్పెషల్ బస్సులు..

Omicron: రాష్ట్రాలపై పంజా విసరుతున్న ఒమిక్రాన్.. తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న కేసులు

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu