RGV Vs Perni Nani: టికెట్ రేట్లపై ముదురుతోన్న వివాదం.. ఏపీ ప్రభుత్వంపై వర్మ పది ప్రశ్నలు(Live Video)
ఆంధ్రప్రదేశ్‌లోని మూవీ థియేటర్ టికెట్ ధరలపై ప్రభుత్వం జీవో జారీ చేసింది. పేదలకు వినోదం అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా తమ ప్రభుత్వం నిర్ణయం..
ఆంధ్రప్రదేశ్‌లోని మూవీ థియేటర్ టికెట్ ధరలపై ప్రభుత్వం జీవో జారీ చేసింది. పేదలకు వినోదం అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా తమ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ప్రభుత్వం చెబుతోంది. అయితే థియేటర్ లో సినిమా టికెట్ ధరను నిర్ణయించే అధికారం ప్రభుత్వానికి లేదంటూ సినీ ప్రముఖులు మండిపడుతున్నారు. టికెట్ ధరలను తగ్గించడంపై సంచలన దర్శకుడు వివాదాల వర్మ కూడా మండిపడుతున్నారు. తనదైన శైలిలో ప్రభుత్వం తీరుని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నాన్ని తనదైన శైలిలో చేస్తున్నారు. అయితే ఇదే విషయం ఇప్పటికే టీవీ 9 బిగ్ డిబేట్ లో పాల్గొన్న రాము.. పేర్ని నానికి మధ్య మాటల యుద్ధం జరిగింది. తాజాగా సోషల్ మీడియా వేదికగా రాము మళ్ళీ ఏపీ ప్రభుత్వానికి టికెట్ ధరలపై స్పందిస్తున్న మంత్రులకు 10 ప్రశ్నలను సంధిస్తూ.. ఓ వీడియో రిలీజ్ చేశారు.
Published on: Jan 05, 2022 08:09 AM
వైరల్ వీడియోలు
Latest Videos