- Telugu News Photo Gallery Spiritual photos Astro Tips Do Not forget to do this work after sunset or else may have to face many problems Here is the Full Details
Astro Tips: సూర్యాస్తమయం తర్వాత ఈ పనులు పొరపాటును కూడా చేయొద్దంటే.. అవేంటో ఇప్పుడే తెలుసుకోండి..!
Astro Tips: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యాస్తమయం తర్వాత కొన్ని పనులు చేయడం నిషిద్ధం. ఇలా చేయడం వల్ల ఆరోగ్య సమస్యలే కాకుండా ఆర్థికపరమైన ఇబ్బందులు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది.
Updated on: Jan 05, 2022 | 2:14 PM

దానం చేయవద్దు: సూర్యాస్తమయం తర్వాత పెరుగును ఎప్పుడూ దానం చేయకూడదు. నిజానికి.. పెరుగు శుక్ర గ్రహానికి సంబంధించిన ఆహార పదార్థంగా పరిగణించబడుతుంది. దీంతో పాటు, శుక్ర గ్రహం ప్రేమ, భౌతిక ఆనందాలు, సంపదను అనుగ్రహించే గ్రహంగా పేర్కొంటారు. అందుకని సూర్యాస్తమయం తర్వాత పెరుగు దానం చేయొద్దంటారు. అలా చేస్తే సంతోషం, శ్రేయస్సు తగ్గుతుంది.

నిద్రపోవద్దు: సూర్యాస్తమయం సమయంలో నిద్రపోకూడదు. అంతే కాకుండా ఈ సమయంలో ఆహారం కూడా తినకూడదు. అలా చేయడం అశుభంగా పేర్కొంటారు. ఒకవేళ అలా చేస్తే అనారోగ్య సమస్యలు రావడమే కాకుండా, జీవితంలో డబ్బు కొరత ఏర్పడుతుంది. అందుకే ఈ సమయంలో భగవంతుడిని పూజిస్తారు.

ఇల్లు ఊడ్చవద్దు: సాయంత్రం కూడా చాలా మంది ఇల్లు ఊడుస్తారు. కానీ, సూర్యాస్తమయం తర్వాత ఎప్పుడూ ఇల్లు క్లీన్ చేయొద్దు. అలా చేస్తే అర్థికంగా నష్టం వాటిల్లుతుందట. సూర్యాస్తమయం తర్వాత ఊడ్చినా, తుడిచినా లక్ష్మి దేవి ఇల్లు వదిలి వెళ్లిపోతుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.

గోర్లు కత్తిరించకూడదు: సూర్యాస్తమయం తర్వాత జుట్టు, గోర్లు ఎప్పుడూ కత్తిరించకూడదు. అలా చేయడం చాలా అశుభం. ఇది జీవితంలో ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. దీంతో ఆర్థిక సమస్యల తలెత్తే అవకాశం ఉంటుంది.

తులసి మొక్క: సూర్యాస్తమయం తర్వాత తులసి మొక్కను తాకకూడదు. ఈ సమయంలో తులసి మొక్కకు నీరు కూడా పోయకూడదు. అలా చేస్తే లక్ష్మి దేవికి కోపం వస్తుంది. ఫలితంగా జీవితంలో ఆర్థిక సమస్యలను ఎదుర్కోవలసి వస్తుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.
