Video: అరంగేట్రంలో హాఫ్ సెంచరీ.. ఆపై అభిమానులతో సెల్ఫీలు.. కట్‌చేస్తే.. ఆసీస్ సెన్సేషన్‌కు బిగ్ షాక్?
Sam Konstas Video: మెల్‌బోర్న్ వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య నాలుగో టెస్టు జరుగుతోంది. ఈ బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్‌లో తొలిరోజు ఆస్ట్రేలియా తరపున అరంగేట్రం చేసిన సామ్ కాన్స్టాన్స్ హీరోగా అవతరించాడు. 65 బంతుల్లో 60 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. కానీ మ్యాచ్‌లో పెద్ద పొరపాటు చేయడంతో ఐసీసీ కన్నేర్ర చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
Sam Konstas Video: మెల్‌బోర్న్‌లో భారత్, ఆస్ట్రేలియా మధ్య బాక్సింగ్ డే టెస్టు ప్రారంభమైంది. తొలి సెషన్ చాలా ఉత్కంఠగా సాగింది. ఈ క్రమంలో మెల్‌బోర్స్ స్టేడియంలో ఎంతో హీట్ నడించింది. విరాట్ కోహ్లి, మహ్మద్ సిరాజ్‌లతో సామ్ కాన్స్టాన్స్ వాగ్వాదం చోటుె చేసుకుంది. అయితే, వీటన్నింటి మధ్య, ఆసీస్ యంగ్ ప్లేయర్ తన అరంగేట్రం మ్యాచ్‌లో 65 బంతుల్లో 60 పరుగులు చేసి తుఫాన్ ఇన్నింగ్స్ ఆడాడు. అతను భారతదేశపు అత్యంత ప్రాణాంతక బౌలర్ జస్ప్రీత్ బుమ్రాపై సిక్సర్లు కొట్టి ఆస్ట్రేలియా అభిమానుల దృష్టిలో హీరోగా మారాడు. దీంతో అభిమానులు ఆయనతో సెల్ఫీలు దిగేందుకు తహతహలాడారు. అభిమానుల డిమాండ్లను నెరవేర్చడానికి కాన్స్టాస్ ఐసీసీ ప్రధాన నియమాన్ని ఉల్లంఘించాడని, దీంతో అతనిపై ఐసీసీ శిక్ష వేయనుందని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.
కాన్స్టాస్ నిబంధనలను ఉల్లంఘించాడా?
నిజానికి, కాన్‌స్టాన్స్ అవుట్ అయిన తర్వాత డగ్ అవుట్‌లో కూర్చున్నాడు. ఈ సందర్భంగా ఆయన ఓ చిన్న ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఇప్పటి వరకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఆ తర్వాత అభిమానుల కోరిక మేరకు వారి ఫోన్ తీసుకుని సెల్ఫీలు తీసుకోవడం మొదలుపెట్టాడు. ఈ విషయానికి సంబంధించి, మ్యాచ్ సమయంలో ఇలా చేయడం ఐసీసీ నిబంధనలకు విరుద్ధమని వాదిస్తున్నారు. అయితే, దీనికి సంబంధించి ఐసీసీ ఎలాంటి నిబంధనలను రూపొందించిందో ఓసారి తెలుసుకుందాం..
ఐసిసి అవినీతి నిరోధక నిబంధనల ప్రకారం, మ్యాచ్ జరిగే ప్రాంతంలో ఏ ఆటగాడు మొబైల్ ఫోన్ వంటి కమ్యూనికేషన్ పరికరాన్ని ఉపయోగించకూడదు. ఇది మాత్రమే కాదు, అనుమతి లేకుండా ఏ ఆటగాడు మ్యాచ్ ప్రాంతం నుంచి బయటకు వెళ్లడం కూడా నిషేధం. మ్యాచ్ ప్రాంతం నుంచి నిష్క్రమించడానికి, మ్యాచ్ అధికారి నుంచి అనుమతి తీసుకోవడం అవసరం. ఐసిసి అవినీతి నిరోధక నిబంధనలను పరిశీలిస్తే, కాన్స్టాన్స్ ఎక్కడో నిబంధనలను ఉల్లంఘించినట్లు తెలుస్తోంది.
శిక్షకు గురయ్యే ఛాన్స్..
HE CAME HE BAT HE SCORED FAST 50 HE DAMAGED INDIAN BOWLING UNIT WITHIN 15 OVER HE WENT OUT HE GOT STANDING OVATION IN MCG HE IS TAKING SELFIE WHAT A DEBUT SEASION TO MAKE HISTORY 🔥🔥
THE NAME IS SAM KONSTAS 👏👏#INDvAUS #Melbourne #BoxingDay #BoxingDayTest #samkonstas… pic.twitter.com/5WhSFVo8ns
— cinepics (@cinepiccollx) December 26, 2024
మ్యాచ్‌లో ఎవరైనా ఐసీసీ అవినీతి నిరోధక నిబంధనలను పాటించకుంటే అతనిపై చర్యలు తీసుకోవచ్చు. నిబంధనల ప్రకారం, ఆటగాడికి జరిమానా విధించవచ్చు. నిబంధనలను ఉల్లంఘిస్తూ, కాన్స్టాస్ మొదట డగౌట్ వదిలి మ్యాచ్ సమయంలో అభిమానుల మధ్యకు వెళ్లాడు. ఆ తర్వాత ఫోన్ వాడాడు. మ్యాచ్ రిఫరీ దీనిపై చర్యలు తీసుకుంటాడో లేదో చూడాలి.
Sam Konstas says that Virat Kohli is his favourite player and the heat of the moment got to both of them !! #INDvsAUS #INDvAUS #AUSvIND #AUSvsIND #Bumrah #BoxingDayTest #SamKonstas #ViratKohli
— Cricketism (@MidnightMusinng) December 26, 2024
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..