తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్ రావు గొప్ప మనసు చాటుకున్నారు. సిద్దిపేటలో ఒక కార్యకర్త కుమార్తె వైద్య విద్య ఫీజు చెల్లించడానికి హరీష్ రావు తన సొంత ఇంటిని తాకట్టు పెట్టి.. రూ. 20 లక్షల రుణం తీసుకున్నారు. అదనంగా హాస్టల్ ఫీజు కోసం రూ. లక్ష ఇచ్చారు. ఈ త్యాగం విద్యార్థిని మమత భవిష్యత్తుకు భరోసా కల్పించింది.