Astrology 2026: పట్టువదలని విక్రమార్కులు.. కొత్త సంవత్సరంలో వారు అనుకున్నది సాధిస్తారు..!
కొత్త సంవత్సరంలో కొన్ని రాశుల వారికి విజయం తథ్యం! పట్టుదల, లక్ష్యసాధనలో రాజీపడని మేషం, వృషభం, సింహం, వృశ్చికం, ధనుస్సు, మకరం రాశులు ఈ ఏడాది తమ ఆశయాలను చేరుకుంటారు. అనుకూల గ్రహస్థితుల వల్ల నాయకత్వం, సంపద వృద్ధి, విదేశీ ఉద్యోగాలు, మెరుగైన జీవనశైలి వంటి లక్ష్యాలను వీరు సాధిస్తారు. జ్యోతిష్య అంచనాల ప్రకారం వీరి కృషికి తగిన ఫలితం లభిస్తుంది.

Achievers Astrology
జ్యోతిషశాస్త్రం ప్రకారం కొన్ని రాశుల వారు పట్టువదలని విక్రమార్కులు. అనుకున్నది సాధించనిదే విడిచిపెట్టరు. ఆశయాలను, లక్ష్యాలను సాధించడంలో ఏమాత్రం రాజీపడరు. కొత్త సంవత్స రంలో కూడా ఈ రాశుల వారు కొన్ని లక్ష్యాలను, ఆశయాలను నిర్దేశించుకుని వాటిని సాధించే అవకాశం ఉంది. ఈ రాశులుః మేషం, వృషభం, సింహం, వృశ్చికం, ధనుస్సు, మకరం. జనవరిలో కుజుడు మకరంలో, మార్చిలో శుక్రుడు మీన రాశిలో, జూన్ మొదటి వారంలో గురువు కర్కాటక రాశిలో ఉచ్ఛపడుతున్నందువల్ల ఈ రాశులవారికి అన్ని విధాలా కలిసి వచ్చే అవకాశం ఉంది.
- మేషం: సహజ నాయకత్వ లక్షణాలు, మొండి పట్టుదల, దూరదృష్టి, కలుపుకునిపోయే తత్వం, నిర్ణయం తీసుకునే తత్వం కలిగిన ఈ రాశివారు అధికారం చేపట్టడం, ఒక సంస్థకు అధిపతి కావడం వంటి లక్ష్యాల మీద దృష్టి పెట్టే అవకాశం ఉంది. విదేశాల్లో ఉద్యోగాలు చేయాలన్న తపన కూడా వీరిలో కాస్తంత ఎక్కువగా ఉంటుంది. ఉంటుంది. వీరికి ఈ ఏడాదంతా కుజ, రాహువు, గురు, గ్రహాలు బాగా అనుకున్నందువల్ల అనుకున్నవి తప్పకుండా సాధిస్తారు. విదేశీ ఉద్యోగాల్లో బాగా రాణిస్తారు.
- వృషభం: ప్రణాళికాబద్ధంగా వ్యవహరించడంలో, ఓర్పు, సహనాలు కలిగి ఉండడంలో, చివరికి పట్టుదలలో కూడా అందరికన్నా ముందుండే ఈ రాశివారు ఈ ఏడాది గురు, కుజ, శనుల అనుకూలత వల్ల ఆదాయ వృద్ధి మీద, సంపన్నులు కావడం మీద ఎక్కువగా దృష్టి పెట్టడం జరుగుతుంది. వ్యక్తి గత, ఆర్థిక సమస్యల్ని పరిష్కరించుకోవడం, కుటుంబ జీవితాన్ని మెరుగుపరచుకోవడం, విలాసవంతంగా జీవించడం, ఆస్తిపాస్తులను పెంచుకోవడం వంటి ఆశలు, ఆశయాలు నెరవేరే అవకాశం ఉంది.
- సింహం: నాయకత్వ లక్షణాలు, అందరినీ కలుపుకునిపోయే తత్వంతో పాటు, విపరీతమై అధికార దాహం కలిగిన ఈ రాశివారిలో ఒక సంస్థకు అధిపతి కావడం, ఒక సంస్థను ఏర్పాటు చేయడం, ఆదాయాన్ని పెంచుకోవడం వంటి అంశాలను లక్ష్యంగా తీసుకునే అవకాశం ఉంది. ఈ రాశివారికి గురు, రాహువులు బాగా అనుకూలంగా మారుతున్నందువల్ల వీరు ఈ దిశగా పురోగతి చెంద డం, అనుకున్నది సాధించడం జరుగుతుంది. ఆదాయాన్ని బాగా వృద్ధి చేసుకోవడం జరుగుతుంది.
- వృశ్చికం: సాటిలేని పట్టుదల, మొండితనాలతోపాటు సాహసం, తెగువ, చొరవ, ధైర్యం పుష్కలంగా ఉండే ఈ రాశివారు ఈ ఏడాది ఎక్కువగా జీవనశైలి మీద దృష్టి పెట్టే అవకాశం ఉంది. ఆస్తిపాస్తులను కూడ గట్టుకోవడం, ఆస్తి సమస్యల్ని పరిష్కరించుకోవడం, సొంత ఇంటిని అమర్చుకోవడం, జీవన శైలిని మార్చుకోవడం మీద దృష్టి పెడతారు. ఎవరి సహాయ సహకారాలు లేకుండానే వీరు తాము అనుకున్నది సాధించే అవకాశం ఉంది. ఏడాది ప్రథమార్థంలో వీరు తప్పకుండా విజేతలవుతారు.
- ధనుస్సు: అగ్రస్థానంలో ఉండాలని, పేరు ప్రఖ్యాతులు సంపాదించాలని తపన పడే ఈ రాశివారు తమ లక్ష్యా నికి తమ ప్రతిభా పాటవాలను, నైపుణ్యాలను బాగా వృద్ధి చేసుకుంటారు. విదేశాల్లో ఉద్యోగం సంపాదించుకోవడం, ఆదాయాన్ని వృద్ధి చేసుకోవడం, బంధుమిత్రుల కంటే ముందుండడంవంటివి సాధించే అవకాశం ఉంది. కుజ, రాహువులతో పాటు రాశ్యధిపతి గురువు కూడా అనుకూలంగా ఉన్నందువల్ల వీరు అధికారం చేపట్టడం, ఒక సంస్థకు అధిపతి కావడం వంటివి జరిగే అవకాశం ఉంది.
- మకరం: పట్టువదలని విక్రమార్కుల జాబితాలో మొదటి స్థానంలో ఉండే ఈ రాశివారు ఆదాయ వృద్ది కోసం, సమాజంలో ఉన్నత స్థానం కోసం బాగా తాపత్రయపడే అవకాశం ఉంది. ఈ రాశివారికి గురు, శనులు బాగా అనుకూలంగా మారుతున్నందువల్ల కొద్ది ప్రయత్నంతో తమ లక్ష్యాలను సాధించుకోవడం జరుగుతుంది. అనేక విధాలుగా ఈ రాశివారి ఆదాయం వృద్ధి చెందడం, వీరికి సరైన గుర్తింపు లభించడం, విదేశాలకు వెళ్లడం వంటివి జూన్ లోగా నెరవేరే అవకాశం ఉంది.



