AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Astro Code: మీ రాశికి లక్కీ నంబర్ ఏంటో తెలుసా? చేతిపై రాస్తే చాలు.. అదృష్టం మీ సొంతం!

సోషల్ మీడియాలో కొత్త ట్రెండ్ ఇది. అదృష్టం కలిసి రావాలన్నా, పట్టిన దరిద్రం వదలాలన్నా చేతిపై ఒక చిన్న నంబర్ రాసుకుంటే చాలని ప్రముఖ జ్యోతిష్య నిపుణురాలు జై మదాన్ చెబుతున్నారు. ఈ 'మ్యాజికల్ నంబర్' వెనుక ఉన్న రహస్యం ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. అదృష్టాన్ని పెంచే అంకెలుగా వీటిని పిలుస్తున్నారు. రాశి ఫలాల ప్రకారం ఒక్కో రాశికి ఒక్కో ప్రత్యేక సంఖ్యను కేటాయిస్తూ, వాటిని ఎలా ఉపయోగించాలో వివరిస్తూ ఓ జ్యోతిష్యుడు ఈ కొత్త ట్రెండ్ ను స్టార్ట్ చేశాడు.

Astro Code: మీ రాశికి లక్కీ నంబర్ ఏంటో తెలుసా? చేతిపై రాస్తే చాలు.. అదృష్టం మీ సొంతం!
Astro Code Manifestation Rituals
Bhavani
|

Updated on: Dec 19, 2025 | 7:09 PM

Share

నేటి కాలంలో అదృష్టం కోసం రకరకాల మార్గాలను వెతకడం సాధారణం అయిపోయింది. ఈ క్రమంలోనే ప్రముఖ స్పిరిచువల్ మెంటర్ మరియు జ్యోతిష్య నిపుణురాలు జై మదాన్ పంచుకున్న ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఎడమ చేతిపై ఒక 4 అంకెల సంఖ్యను రాసుకోవడం వల్ల గ్రహాల ప్రతికూల ప్రభావం తగ్గి, అదృష్టం వరిస్తుందని ఆమె పేర్కొన్నారు.

ఈ రిచ్యువల్ ఎలా చేయాలి? జై మదాన్ సూచన ప్రకారం, మీ రాశికి కేటాయించిన 4 అంకెల సంఖ్యను ప్రతిరోజూ ఎడమ చేతిపై రాసుకోవాలి. ఈ సంఖ్య రాత్రంతా చేతిపైనే ఉండాలి. ఇలా వరుసగా 40 రోజుల పాటు ఏమాత్రం విరామం లేకుండా చేస్తేనే ఫలితం ఉంటుందని ఆమె చెబుతున్నారు. ఈ నిరంతర ప్రక్రియ వల్ల విశ్వంలోని శక్తులు మీకు అనుకూలంగా మారుతాయని ఆమె నమ్మకం.

రాశుల వారీగా ఆ ‘మ్యాజికల్ నంబర్స్’ ఇవే:

మేషం: 3845

వృషభం: 9162

మిథునం: 2019

కర్కాటకం: 7431

సింహం: 5820

కన్య: 1376

తుల: 4625

వృశ్చికం: 3107

ధనుస్సు: 7254

మకరం: 8543

కుంభం: 6527

మీనం: 4281

ఎందుకు ఇవి అంతగా వైరల్ అవుతున్నాయి? జీవితం అనిశ్చితంగా ఉన్నప్పుడు ఇలాంటి చిన్న చిన్న పద్ధతులు మనిషికి ఒక రకమైన భరోసాను ఇస్తాయి. మనస్తత్వ శాస్త్ర నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఏదైనా ఒక పనిని నమ్మకంతో చేసినప్పుడు మన ఆలోచనా విధానంలో సానుకూల మార్పు వస్తుంది. ఆ ఆశావహ దృక్పథమే కొత్త అవకాశాలను అందిపుచ్చుకునేలా మనల్ని ప్రేరేపిస్తుంది. దీన్నే చాలామంది ‘అదృష్టం’ అని భావిస్తారు.

గ్రహాల స్థితిగతులు మారుతాయా లేదా అన్నది పక్కన పెడితే, ఇలాంటి పద్ధతులు మనిషిలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతున్నాయి. అందుకే ఇవి వేగంగా ప్రజల్లోకి వెళ్తున్నాయి.

(గమనిక: ఈ సమాచారం కేవలం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నమ్మకాలపై ఆధారపడి అందించినది. దీనికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. పాఠకులు విజ్ఞతతో నిర్ణయం తీసుకోవాలి.)