20 December 2025

కలబంద గుజ్జు తింటాను.. అదే నా ఫిట్నెస్, బ్యూటీ సీక్రెట్స్.. హీరోయిన్

Rajitha Chanti

Pic credit - Instagram

దాదాపు 20 సంవత్సరాలుగా సౌత్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా అలరిస్తుంది. తాజాగా ఈ అమ్మడు తన ఫిట్నెస్, బ్యూటీ సీక్రెట్స్ రివీల్ చేసింది.

తనే హీరోయిన్ రెజీనా కాసాండ్రా. తన రోజూ ఉదయం వేడి వేడి మసాలా టీతో మొదలవుతుందని.. ఆరోగ్యానికి సరిపడ డైట్ తీసుకుంటుందట.

ఉదయాన్నే మసాలా టీ తాగిన తర్వాత బ్రేక్ ఫాస్ట్ లోకి మొలకలు, బాదంలాంటి డ్రై ఫ్రూట్స్ తీసుకుంటానని, అలాగే పండ్ల రసం తాగుతుందట. 

ఇవే కాకుండా ఇడ్లీ, దోసే వంటి ఫుడ్స్ తీసుకుంటానని.. మధ్యాహ్నం భోజనంలో కార్బోహైడ్రేట్స్‌ ఉన్న ఆహారం తింటానని చెప్పుకొచ్చింది రెజీనా. 

బీన్స్, క్యారెట్, ఇంకా ఉడికించిన కూరగాయలు, పప్పు భోజనంలో తప్పకుండా ఉండాల్సిందేనని అన్నారు. అన్నంతో తీసుకుంటే కార్బోహైడ్రేట్స్‌, ప్రోటీన్‌ రెండూ అందుతాయట.

వారంలో ఒక రోజంతా కేవలం పండ్ల రసాలతోనే సరిపెట్టేస్తానని అంటుంది. రెండు వారాలకోసారి కలబంద గుజ్జు తింటాను.  అందుకు పొట్ట ఖాలీగా ఉంచుకుంటుందట. 

కలబంద గుజ్జు చర్మానికి నిగారింపుతోపాటు.. ఆరోగ్యంగా ఉండేలా  చేస్తుందని అన్నారు. వారానికి ఒక రోజు మొత్తం నీళ్లు తాగి ఉంటుందట.

ఆహారంతోపాటు శరీరానికి అవసరమైన వ్యాయమాలు, యోగ చేస్తానని.. అలాగే చక్కెర పదార్థాలకు దూరంగా ఉంటానని చెప్పుకొచ్చింది రెజీనా.