కోయంబత్తూరులోని రద్దీ రోడ్డుపై మూడు గుర్రాలు కట్టుతప్పి పరుగులు తీశాయి. వాహనాలను ఢీకొంటూ, అడ్డం వచ్చిన వారిని తొక్కుకుంటూ వెళ్లడంతో పలువురు గాయపడ్డారు. స్కూటీపై వెళ్తున్న మహిళ, ఇద్దరు పిల్లలను ఢీకొట్టడంతో వారు స్వల్పంగా గాయపడ్డారు. ఈ ఘటన స్థానికులలో తీవ్ర భయాందోళనలు కలిగించింది.