20 December 2025
నా అందం సీక్రెట్ ఇదే.. ఉదయాన్నే ముఖంపై ఉమ్మి రాస్తా.. స్టార్ హీరోయిన్
Rajitha Chanti
Pic credit - Instagram
తమిళంలో మంచి క్రేజ్ ఉన్న హీరోయిన్ మాళవిక మోహనన్. ఇప్పుడు ప్రభాస్ సరసన రాజాసాబ్ మూవీతో తెలుగు తెరకు పరిచయం కాబోతుంది.
తాజాగా ఈ అమ్మడు ఓ ఇంటర్వ్యూలో తన అందం, ఫిట్‌నెస్ సీక్రెట్స్ బయటపెట్టింది. తనకు ఇష్టమైన రంగు పింక్ అని.. అది సంతోషాన్ని ఇస్తుందని తెలిపింది.
తన అందం కోసం ఎక్కువగా ఆయుర్వేద ఉత్పత్తులను ఉపయోగిస్తానని అంటుంది. ఫేస్ ప్యాక్ గా రెడ్ సాండర్ పేస్ట్, మేకప్ రిమూవర్ గా కొబ్బరి నూనె వాడుతుందట.
జుట్టు సంరక్షణకు ఆయుర్వేత ఆయిల్స్ వాడుతుందట. తాను చదువుకునే సమయంలో అథ్లెటిక్స్‌లో చురుగ్గా ఉన్నానని.. ఇప్పుడు వ్యాయామం చేస్తానని అంటుంది.
వ్యాయామంతోపాటు యోగాకు సైతం సమయం కేటాయిస్తానని అంటుంది. ఫిట్‌నెస్ కోసం అవసరమైన డైట్ ఫాలో అవుతానని చెబుతుంది ఈ ముద్దుగుమ్మ.
ఇడ్లీ, పప్పు, అన్నం, దోస అన్ని తింటానని.. ఆ తర్వాత అందుకు తగిన వ్యాయామం చేస్తానని అంటుంది. బిర్యానీ ఇష్టమైనా ఫిట్‌నెస్ కోసం దూరంగా ఉంటుందట.
బియాండ్ ది క్లౌడ్స్ షూటింగ్ సమయంలో తాను కఠినమైన ఆహారం తీసుకోవాల్సి వచ్చిందని.. 18 రోజుల్లో దాదాపు 8 కిలోలు తగ్గిందట.
తన ఫిట్నెస్, అందం కోసం ఎక్కువగా యోగాపై దృష్టి పెడతానని అన్నారు. ప్రస్తుతం ఈ అమ్మడు ప్రభాస్ జోడిగా రాజాసాబ్ చిత్రంలో నటిస్తుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
తల్లి కావాలని ఇప్పటికీ కలలు కంటాను.. ఆలస్యం అనుకోవట్లేదు.. సమంత.
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్