నావికా స్థావరానికి.. చైనా జీపీఎస్ ట్రాకర్ ఉన్న గూఢాచార పక్షి
సముద్రపు పక్షికి అమర్చిన చైనా జీపీఎస్ ట్రాకర్ కర్ణాటకలోని కర్వార్ తీరంలో కలకలం రేపింది. నావికా స్థావరాలున్న ప్రాంతంలో సీగల్ పక్షిపై ట్రాకర్ కనిపించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఇది పక్షుల వలసల అధ్యయనమా లేక గూఢచర్యమా అనే కోణంలో చైనా అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఈమెయిల్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.
చైనా జీపీఎస్ ట్రాకర్ అమర్చిన సముద్రపు పక్షి కర్ణాటక తీరంలో కనిపించడం కలకలం రేపింది. ఉత్తర కన్నడ జిల్లాలోని కర్వర్ తీరంలో మెరైన్ పోలీసులు ఈ పక్షిని గుర్తించారు. సీగల్ పక్షి ఒంటికి ఓ జీపీఎస్ ట్రాకర్ చుట్టి ఉంది. ఆ జీపీఎస్‌లో ఒక ఎలక్ట్రానిక్ యూనిట్, సోలార్ ప్యానల్ ఉంది. పక్షిని చూసిన వారు ట్రాకర్‌కి ఉన్న ఐడీ ద్వారా తమను సంప్రదించాలన్న సూచన ఉంది. చైనా అకాడమీ ఆఫ్ సైన్సెస్‌కు సంబంధించిన ఈమెయిల్ ఐడీ కనిపించింది. ఈ విషయంపై క్లారిటీ కోసం అధికారులు ప్రయత్నిస్తున్నారు. పక్షుల వలసలను అధ్యయనం చేసే ప్రాజెక్టులో ఈ పక్షి భాగమా అనే కోణాన్ని పరిశీలిస్తున్నారు. అయితే నావికా స్థావరాలున్న కర్నాటక కర్వర్ తీరంలో చైనా జీపీఎస్ ట్రాకర్ ఉన్న పక్షి రావడం ఏంటన్న కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ పక్షులు సంతానోత్పత్తి సమయంలో ఇతర ప్రాంతాలకు వలసపోతుంటాయి. సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో ఇవి ఉత్తారన ఉన్న చల్లని ప్రాంతాల నుంచి భూమధ్య రేఖకు సమీపంలో వేడి ఎక్కువగా ఉండే ప్రాంతాలకు వలస వస్తుంటాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. త్వరలో రైల్వే ఉద్యోగ నోటిఫికేషన్
మహిళలకు గుడ్‌న్యూస్.. బ్యాంక్ అకౌంట్‌లోకి రూ.15 వేలు
Avatar 3 Review: ప్లీజ్ కామెరాన్.. ఇక ఆపేస్తే బెటరేమో బాస్.. అవతార్ 3 రివ్యూ
ఊరు ఊరంతా కరెంట్ షాక్.. సెల్‌ఫోన్ ఛార్జింగ్ పెడుతూ యువకుడు
బట్టతల దాచిపెట్టి పెళ్లి.. బండారం బయటపడగానే.. బ్లాక్ మెయిల్
ఏడేళ్లుగా ఒంటికాలిపై సాధువు !! అన్న పానీయాలు, నిద్రా ఆ భంగిమలోనే
కొత్త రకం రెల్లుజాతి పామును చూసారా ??
అర్ధరాత్రి బాల్కనీలో చిక్కుకుపోయిన యువకులు..
స్కూళ్లలో ప్రతి శనివారం డ్యాన్స్‌లే..!
దిష్టిబొమ్మగా పెద్ద కళ్ళ మహిళ !! ఇంతకీ ఎవరీమె ??
ఛీ.. వీడు మనిషేనా ?? తల్లికి అనారోగ్యంగా ఉందని సెలవు అడిగితే
