AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సింక్ అయిన దర్శకులతో సీనియర్ల సందడి

సింక్ అయిన దర్శకులతో సీనియర్ల సందడి

Dr. Challa Bhagyalakshmi - ET Head
| Edited By: |

Updated on: Dec 20, 2025 | 4:11 PM

Share

సీనియర్ తెలుగు హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, పవన్ కళ్యాణ్ తమకు నచ్చిన దర్శకులతో కలిసి కొత్త ఉత్సాహంతో దూసుకుపోతున్నారు. వయస్సును మర్చిపోయి, యువకుల్లా శివమెత్తుతూ అద్భుతమైన ప్రదర్శనలు ఇస్తున్నారు. ఈ 'సింక్ అయిన' కాంబినేషన్లు టాలీవుడ్‌లో కొత్త ట్రెండ్‌ను సృష్టిస్తూ, ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందనను పొందుతున్నాయి. వారి గత చిత్రాలకు భిన్నంగా తెరపై కనిపిస్తున్నారు.

సింక్ అయిన దర్శకులతో శివమెత్తుతున్నారు సీనియర్ హీరోలు. తమ ఏజ్ మరిచిపోయి ఇష్టంగా కష్టపడుతున్నారు. అసలు వీళ్లు మనం ఇన్నాళ్ళూ చూసిన హీరోలేనా అనే అనుమానాలు వచ్చేంతగా మారిపోతున్నారు. మరి సింక్ అయిన దర్శకులెవరు.. శివాలెత్తుతున్న సీనియర్లు ఎవరు..? అసలేంటి కథ.. చూద్దామా ఎక్స్‌క్లూజివ్‌గా..! చూస్తున్నారుగా ఇక్కడ చిరంజీవి చేస్తున్న అల్లరి.. మెగాస్టార్‌ను ఇలా చూసి ఎన్నాళ్లైందో కదా..? కొన్నేళ్లుగా తను మిస్సైన ఎంటర్‌టైన్మెంట్ అంతా అనిల్ రావిపూడి సినిమా సెట్స్‌లో తీర్చేసుకుంటున్నారు మెగాస్టార్. నిజం చెప్పాలంటే అనిల్ సినిమా అనౌన్స్ అయిన రోజు నుంచే చిరులో వింటేజ్ అల్లరి బయటికొచ్చింది. చిరంజీవికి ఎంటర్‌టైన్మెంట్ అంటే ఓన్ గ్రౌండ్ మాదిరి..! కొన్నేళ్లుగా తనది కాని గ్రౌండ్‌లోనే బరిలోకి దిగుతున్నారు చిరు. ఇన్నాళ్లకు కామెడీ జోనర్‌లోకి రావడంతో చిన్న పిల్లాడిలా ఎగ్జైట్ అయిపోతున్నారు. అందుకే ముందే పూర్తైన విశ్వంభరను కూడా పక్కనబెట్టి.. అనిల్ సినిమానే ముందు తీసుకొస్తున్నారు. పైగా పాటలకు అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది. బాలయ్య కూడా తనకు సింక్ అయిన దర్శకుల కోసం ప్రాణం పెట్టేస్తున్నారు. అఖండ 2లో శక్తివంచన లేకుండా నటించారు నటసింహం. నెక్ట్స్ గోపీచంద్ మలినేని సినిమా కోసం వారియర్‌గా మారిపోతున్నారు. పీరియడ్ డ్రామాగా ఈ సినిమా వస్తుంది. దీనికోసం ఇప్పట్నుంచే మేకోవర్ అవుతున్నారీయన. వీరసింహారెడ్డి తర్వాత రిపీట్ అవుతున్న కాంబో ఇది. సంక్రాంతికి వస్తున్నాంతో బ్లాక్‌బస్టర్ కొట్టిన వెంకటేష్.. త్రివిక్రమ్‌తో అల్లరి చేసేందుకు సిద్ధమైపోయారు. ఫ్యామిలీ జోనర్‌కు కేరాఫ్ అడ్రస్ అయిన వీళ్లిద్దరూ కలిసి ఆదర్శ కుటుంబం ఎలా ఉంటుందో చూపించబోతున్నారు. ఇక డాన్స్ చేయడమే మరిచిపోయిన పవన్ కళ్యాణ్.. హరీష్ శంకర్ కోసం పుష్కరం తర్వాత కాలు కదిపి.. చిన్న పిల్లాడిలా ఎంజాయ్ చేసారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

87 ఏళ్లకు తండ్రి అయిన కోటీశ్వరుడు.. కొత్తగా పుట్టిన కొడుకే వారసుడని షాకింగ్‌ ప్రకటన

నావికా స్థావరానికి.. చైనా జీపీఎస్ ట్రాకర్‌ ఉన్న గూఢాచార పక్షి

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. త్వరలో రైల్వే ఉద్యోగ నోటిఫికేషన్‌

మహిళలకు గుడ్‌న్యూస్‌.. బ్యాంక్‌ అకౌంట్‌లోకి రూ.15 వేలు

Avatar 3 Review: ప్లీజ్ కామెరాన్.. ఇక ఆపేస్తే బెటరేమో బాస్.. అవతార్ 3 రివ్యూ