AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Spirit: సందీప్ వంగాను కంగారుపెడుతున్న రాజా సాబ్

Spirit: సందీప్ వంగాను కంగారుపెడుతున్న రాజా సాబ్

Dr. Challa Bhagyalakshmi - ET Head
| Edited By: |

Updated on: Dec 20, 2025 | 4:08 PM

Share

ప్రభాస్ 'స్పిరిట్' సినిమాకు ఊహించని కష్టాలు ఎదురయ్యాయి. 'రాజా సాబ్' ప్రమోషన్స్, 'స్పిరిట్' షూటింగ్ మధ్య ప్రభాస్ ఇరుక్కున్నారు. స్పిరిట్ లుక్ లీక్ కాకుండా సందీప్ రెడ్డి వంగా టెన్షన్ పడుతున్నారు. ఈ సమస్యల నుంచి బయటపడటానికి వంగా ఒక మాస్టర్ ప్లాన్ వేశారు. ప్రస్తుత లుక్‌లో ఉన్న సీన్స్ త్వరగా పూర్తి చేసి, 'రాజా సాబ్' విడుదలయ్యాక మరో లుక్‌లో షూటింగ్ ప్లాన్ చేస్తున్నారు.

స్పిరిట్ సినిమాకు ఊహించని కష్టాలు వచ్చాయి.. ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చిందంటారు కదా.. ఇంచుమించూ ఇప్పుడు స్పిరిట్ సినిమా విషయంలో సందీప్ రెడ్డి వంగాకు వస్తున్న కష్టాలు కూడా అలాగే ఉన్నాయి. వాటి నుంచి బయటపడేందుకు ఓ మాస్టర్ ప్లాన్ వేసారు వంగా. మరి అదేంటి.. ఇంతకీ స్పిరిట్‌కు వచ్చిన కష్టాలేంటి..? చాలా రోజుల తర్వాత ప్రభాస్ మళ్లీ రెండు సినిమాలపై కాన్సట్రేట్ చేయాల్సి వస్తుంది. ఓవైపు రాజా సాబ్ ప్రమోషన్స్.. మరోవైపు స్పిరిట్ షూటింగ్ అంటూ రెండు పడవల ప్రయాణం చేస్తున్నారు రెబల్ స్టార్. జనవరి 9న రాజా సాబ్ రానుండటంతో.. ప్రమోషన్ కోసం వచ్చేందుకు రెడీ అయ్యారీయన. ఇప్పటి వరకైతే ప్రభాస్ లేకుండా ప్రమోషన్స్ జరుగుతున్నాయి. రాజా సాబ్ ప్రమోషన్స్ కోసం డిసెంబర్ లాస్ట్ వీక్ నుంచి టైమ్ ఇచ్చారు ప్రభాస్. అన్నీ కుదిర్తే ప్రీ రిలీజ్ ఈవెంట్ నుంచే నాన్ స్టాప్ ఈవెంట్స్‌లో పాల్గొనబోతున్నారు. ఈ లోపు స్పిరిట్ షూటింగ్ వీలైనంత పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నారు సందీప్ రెడ్డి వంగా. ఇక్కడే అసలు సమస్యలు వస్తున్నాయి.. ప్రమోషన్ కోసం బయటికొస్తే ప్రభాస్ లుక్ రివీల్ అవుతుందనేది సందీప్ టెన్షన్. స్పిరిట్ షూటింగ్ మొదలైన రెండ్రోజులకే సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు లీక్ అయ్యాయి. ఇప్పుడు గానీ ప్రభాస్ బయటికొస్తే మొత్తం లుక్ అంతా బయటికి వచ్చేస్తుంది. అందుకే నాన్ స్టాప్ షెడ్యూల్ చేస్తున్నారు సందీప్ వంగా. ప్రజెంట్ లుక్‌లో ఉన్న సీన్స్ అన్నీ పూర్తి చేస్తున్నారీయన. రాజా సాబ్ రిలీజ్ తర్వాత ఇంకో లుక్‌లో షూటింగ్ ప్లాన్ చేస్తున్నారు. డిసెంబర్ 27న ఉప్పల్ గ్రౌండ్స్‌లో రాజా సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. ప్రభాస్‌తో పాటు మరో స్టార్ హీరో దీనికి చీఫ్ గెస్ట్‌గా రానున్నారు. జనవరి 9న విడుదల కానున్న రాజా సాబ్‌కు ముందురోజే భారీ ప్రీమియర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ లెక్కన డిసెంబర్ చివరి వారం వరకు స్పిరిట్‌తోనే బిజీగా ఉండబోతున్నారు రెబల్ స్టార్.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

87 ఏళ్లకు తండ్రి అయిన కోటీశ్వరుడు.. కొత్తగా పుట్టిన కొడుకే వారసుడని షాకింగ్‌ ప్రకటన

నావికా స్థావరానికి.. చైనా జీపీఎస్ ట్రాకర్‌ ఉన్న గూఢాచార పక్షి

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. త్వరలో రైల్వే ఉద్యోగ నోటిఫికేషన్‌

మహిళలకు గుడ్‌న్యూస్‌.. బ్యాంక్‌ అకౌంట్‌లోకి రూ.15 వేలు

Avatar 3 Review: ప్లీజ్ కామెరాన్.. ఇక ఆపేస్తే బెటరేమో బాస్.. అవతార్ 3 రివ్యూ