AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బ్యాంక్ మేనేజర్ సమయస్పూర్తి.. సైబర్ కేటుగాళ్ల ఉచ్చు నుంచి బయటపడ్డ రిటైర్డ్ టీచర్‌..!

డిజిటల్ అరెస్ట్ పేరుతో సైబర్ నేరగాళ్లు రోజురోజుకు విజృంభిస్తున్నారు. సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా పోలీసులు అవగాహన సదస్సులు నిర్వహించినా జనం మోసానికి గురవుతూనే ఉన్నారు. మహిళలు, వృద్ధులు, రిటైర్డ్ ఉద్యోగుల టార్గెట్ గా సైబర్ నేరగాళ్లు వినూత్న పద్ధతుల్లో మోసాలు చేస్తున్నారు. తాజాగా మరో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది.

బ్యాంక్ మేనేజర్ సమయస్పూర్తి.. సైబర్ కేటుగాళ్ల ఉచ్చు నుంచి బయటపడ్డ రిటైర్డ్ టీచర్‌..!
Cyber Crime
M Revan Reddy
| Edited By: |

Updated on: Dec 20, 2025 | 4:47 PM

Share

డిజిటల్ అరెస్ట్ పేరుతో సైబర్ నేరగాళ్లు రోజురోజుకు విజృంభిస్తున్నారు. సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా పోలీసులు అవగాహన సదస్సులు నిర్వహించినా జనం మోసానికి గురవుతూనే ఉన్నారు. మహిళలు, వృద్ధులు, రిటైర్డ్ ఉద్యోగుల టార్గెట్ గా సైబర్ నేరగాళ్లు వినూత్న పద్ధతుల్లో మోసాలు చేస్తున్నారు. తాజాగా మరో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. అయితే బ్యాంక్ మేనేజర్ సమయస్పూర్తి సైబర్ కేటుగాళ్ల ఉచ్చు నుంచి రిటైర్డ్ టీచర్‌ రెప్పపాటులో బయటపడ్డాడు.

నల్లగొండ పట్టణానికి చెందిన పుచ్చకాయల దేవేందర్ రెడ్డి ప్రభుత్వ టీచర్‌గా విధులు నిర్వహించి రిటైర్ అయ్యారు. పిల్లలు విదేశాల్లో ఉండడంతో దంపతులు మాత్రమే నల్గొండలో ఉంటున్నారు. రిటైర్డ్ టీచర్ దేవేందర్ రెడ్డిని సైబర్ నేరగాళ్లు టార్గెట్ చేశారు. దేవేందర్ రెడ్డి పేరుతో సైబర్ దుండగులు కొత్త సిమ్ తీసుకున్నారు. బెంగళూరులో అసాంఘిక కార్యకలాపాలు పాల్పడుతూ డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు తప్పుడు ఆరోపణలు చేశారు. అంతేకాదు తప్పుడు నమోదు అయ్యాయంటూ.. అరెస్ట్ చేస్తున్నట్లు బెదిరించారు. అరెస్ట్ కాకుండా ఉండాలంటే తాము చెప్పినట్లు నడుచుకోవాలంటూ హుకుం జారీ చేసింది.

ఎటు వెళ్లకుండా ఇంట్లోనే బంధించి, తామిచ్చే అకౌంట్ నంబర్‌కు వెంటనే రూ.18 లక్షలు డిపాజిట్ చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే బెంగళూరులో డిజిటల్ అరెస్ట్ చేస్తామని బెదిరించారు. సైబర్ నేరగాళ్లు ఫోన్ కాల్స్ చేయడంతో దేవేందర్ రెడ్డి తీవ్ర భయాందోళనకు గురయ్యారు. బెదిరింపులకు భయపడి బాధితుడు ప్రకాశం బజార్‌లోని ఎస్‌బీఐ బ్యాంక్‌ కు వెళ్ళాడు. రూ.18 లక్షలు డిపాజిట్ చేయాలని మేనేజర్‌ను కోరాడు.

ఒకే సారి అంత మొత్తం డిపాజిట్ చేయడంపై అనుమానం వచ్చిన మేనేజర్‌.. వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. బ్యాంకు మేనేజర్ సమాచారంతో సైబర్ క్రైమ్ డీఎస్పీ లక్ష్మీనారాయణ బృందం బ్యాంకుకు చేరుతుంది. బాధితుడు దేవేందర్ రెడ్డిని విచారించిన సైబర్ క్రైమ్ పోలీసులు బాధితుడికి వచ్చిన ఫోన్ కాల్ లిస్టును పరిశీలించారు. పోలీసులు దేవేందర్ రెడ్డికి వచ్చిన కాల్ లిస్ట్‌లోని సైబర్ నేరగాళ్లకు కాల్ చేసి ప్రశ్నించారు. పోలీసుల ప్రశ్నలకు తడబడిన దుండగులు సమాధానాలు చెప్పలేక వెంటనే ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు. ఇది సైబర్ దుండగుల పనేనని సైబర్ క్రైమ్ పోలీసులు నిర్ధారించారు.

బ్యాంక్ మేనేజర్ అప్రమత్తత, సైబర్ క్రైమ్ పోలీసుల రాకతో బాధితుడు దేవేందర్ రెడ్డి అకౌంట్ నుండి రూ.18 లక్షలు ట్రాన్స్‌ఫర్ కాకుండా నిలువరించారు. డిజిటల్ అరెస్ట్ పేరుతో ప్రభుత్వ సంస్థలు, అధికారులు బెదిరించడం, భయపెట్టడం చేయరనీ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ చెబుతున్నారు. ఇలాంటి మోసపూరిత వ్యక్తుల సమాచారాన్ని 1930 టోల్ ఫ్రీ నంబరు కు రిపోర్ట్ చేయాలని సూచించారు.

వీడియో ఇక్కడ చూడండి..

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..