Hyderabad: ఇకపై భాగ్యనగరంలో ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తే అంతే సంగతులు.. తాట తీస్తున్న పోలీసులు!
సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో బహిరంగ ప్రదేశాల్లో అక్రమ కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేందుకు యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ (AHTU) ప్రత్యేక స్పెషల్ డ్రైవ్ నిర్వహించింది. వారం రోజులపాటు ముందస్తు నిఘా, గూఢచర్య సమాచారంతో పాటు మఫ్టీ పోలీసుల సహకారంతో చేపట్టిన ఈ ఆపరేషన్‌లో మొత్తం 66 మందిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.

ఈ వారం రోజుల వ్యవధిలో మఫ్టీలో 137 డెకాయ్ ఆపరేషన్లు నిర్వహించారు. ముఖ్యంగా జనసంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాలు, ఐటీ కారిడార్ పరిధిలోని రాత్రి వేళల్లో జరిగే అనుమానాస్పద కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఐటీ ఉద్యోగులు, మహిళలు, యువత భద్రతకు భంగం కలిగించే విధంగా జరుగుతున్న చర్యలను గుర్తించి వెంటనే చర్యలు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఆపరేషన్ల ద్వారా అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా 17 మంది ట్రాన్స్‌జెండర్లు, సెక్స్ వర్కర్లను అదుపులోకి తీసుకున్నట్లు సైబరాబాద్ పోలీసులు తెలిపారు.
ఇదే సమయంలో కుటుంబ కలహాల నేపథ్యంలో సమస్యలు ఎదుర్కొంటున్న 22 కుటుంబాల్లోని భార్యాభర్తలకు పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహించారు. చిన్న చిన్న కారణాలతో కుటుంబాల్లో తలెత్తుతున్న వివాదాలు పెద్ద సమస్యలుగా మారకుండా చూడటమే లక్ష్యంగా ఈ కౌన్సిలింగ్ కార్యక్రమాలు నిర్వహించినట్లు పోలీస్ అధికారులు తెలిపారు. పరస్పర అవగాహన, సహనం పెంచుకోవాలని, అవసరమైతే నిపుణుల సహాయం తీసుకోవాలని సూచించారు.
సైబరాబాద్ పరిధిలో శాంతి భద్రతలు, మహిళల భద్రత, సామాజిక బాధ్యత దృష్ట్యా ఇటువంటి స్పెషల్ డ్రైవ్‌లు భవిష్యత్తులోనూ కొనసాగుతాయని పోలీసులు స్పష్టం చేశారు. అక్రమ కార్యకలాపాలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తూ, ప్రజలు కూడా పోలీసులకు సహకరించి సమాచారాన్ని అందించాలని సైబరాబాద్ పోలీసులు విజ్ఞప్తి చేశారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..