3 నెలల హైటెన్షన్ .. ఎట్టకేలకు చిక్కిన మ్యాన్ ఈటర్.. ఊపిరి పీల్చుకున్న యంత్రాంగం
మహారాష్ట్ర చంద్రపూర్ జిల్లాలో రెండు నెలలుగా భీతిగొల్పిన నరభక్షక పులి టీ 115 ఎట్టకేలకు పట్టుబడింది. రైతులు, పశువులను పొట్టనపెట్టుకున్న ఈ మ్యాన్ ఈటర్‌ను పట్టుకునేందుకు అటవీశాఖ భారీ ఆపరేషన్ చేపట్టింది. ట్రాప్ కెమెరాలు, మత్తు ఇంజక్షన్ సాయంతో పులిని బంధించి టైగర్ ట్రాంజిట్ సెంటర్‌కు తరలించారు. ప్రజలకు భద్రత కల్పించే దిశగా ఇది కీలక విజయం.

రెండు, మూడు నెలలుగా అటవిశాఖకు చుక్కలు చూపిస్తున్న మ్యాన్ఈటర్ బోనుకు చిక్కింది. 30 మందికి పైగా అటవీశాఖ అదికారులు, మూడు ట్రాకింగ్ టీమ్స్ , వందల సంఖ్యలో ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసి రెండు నెలలుగా చేపట్టిన టైగర్ రెస్క్యూ ఆపరేషన్ ఎట్టకేలకు సక్సెస్ అయింది. రైతులను, రైతు కూలీల ప్రాణాలను పదుల సంఖ్యలో పశువులను పొట్టనపెట్టుకున్న రక్తం మరిగిన బెబ్బులిని మత్తు మందు ఇంజక్షన్ సాయంతొ ఎట్టకేలకు బందించింది అటవిశాఖ. ఈ ఘటన మహారాష్ట్ర చంద్రపూర్ జిల్లాలోని పొంబూర్ణ తాలూకాలో చోటు చేసుకుంది.
మహారాష్ట్ర చంద్రపూర్ జిల్లా గోండ్ పిప్పిరీ తాలూకాలో ఇద్దరు వ్యవసాయ కూలీలను పొట్టనబెట్టుకున్న బెబ్బులిని మహారాష్ట్ర అటవీశాఖ అదికారులు బంధించారు. గత అక్టోబరు 18న చెక్ పిపిరీ గ్రామానికి చెందిన బావూజి పాల్ , అక్టోబర్ 26న గణేష్ పిపిరీ గ్రామానికి చెందిన అల్కా పెందోన్ అనే రైతులను బలి తీసుకున్న పులిని పట్టుకోవాలంటూ స్థానిక ప్రజానికం పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టింది.
పులిని పట్టుకొని తమప్రాణాలు కాపాడాలని గోండ్ పిప్పిరి తాలూకా ప్రజలు ఆందోళన ఉదృతం చేయడంతో అటవిశాఖ రంగంలోకి దిగింది. పులి పాద ముద్రల ఆదారంగా టైగర్ ట్రాకింగ్ టీమ్స్ ఇచ్చిన సమాచారంతో పొంబూర్ణ తాలుకా అటవి ప్రాంతంలో రెస్క్యూ ఆపరేషన్ చేపట్టింది. ట్రాప్ కెమెరాలకు చిక్కిన పులిని మత్తు ఇంజక్షన్ ఇచ్చి ఎట్టకేలకు బోనులో బంధించింది అటవిశాఖ.
పొంబూర్జ తాలూకా అటవి ప్రాంతంలో అవినాష్ పూల్ జలే అనే షార్ప్ సూటర్ సహాయంతో పులికి మత్తు ఇంజక్షన్ ఇచ్చిన అటవిశాఖ ఈ ఆపరేషన్ ను విజయవంతంగా పూర్తి చేసింది. మత్తులోకి జారుకున్న పులిని బందించిన అటవిశాఖ.. చంద్రపూర్ లోని టీటీసీ (టైగర్ ట్రాంజక్టు సెంటర్) కు తరలించింది. పట్టుబడ్డ పులి మూడున్నరేళ్ల టీ 115 మగపులి గా గుర్తించిన అటవిశాఖ టైగర్ ట్రాంజక్ట్ సెంటర్ లో సురక్షితంగా ఉండేలా ఏర్పాటు చేసింది.
వీడియో ఇక్కడ చూడండి…
టీ 115ను పట్టుకోవాలంటూ జిల్లా వ్యాప్తంగా రాస్తారోకోలు, అధికారులకు వినతిపత్రాలు సైతం సమర్పించారు అక్కడి స్థానికులు. అధికారులు సైతం ఈ పులిని పట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. చివరకు చంద్రాపూర్ జిల్లా పొంబూర్ణ తాలూకా కెమారా అటవీ ప్రాంతంలో బోను ఏర్పాటు చేశారు. చంద్రపూర్ ఫారెస్ట్ డివిజన్ నుండి ఒక రాపిడ్ రెస్పాన్స్ యూనిట్, వెటర్నరీ అధికారి డాక్టర్ కుందన్ పోడ్చల్వర్, RFO కిషోర్ గౌర్కర్ పర్యవేక్షణలో ఆపరేషన్ విజయవంతంగా నిర్వహించారు. అయితే చంద్రపూర్ జిల్లాలో టీ 115 లానే మరో మూడు మ్యాన్ఈటర్ లు సంచరిస్తున్నట్టు అక్కడి అటవిశాఖ గుర్తించింది. పులుల సంఖ్య పెరగడం.. ఆహార కొరత ఏర్పడటంతోనే పులులు అభయారణ్యాలను వీడి గ్రామాల మీద పడుతున్నాయని.. అడ్డొచ్చిన పశువులను హతం చేస్తున్నాయని మహారాష్ట్ర అటవిశాఖ గుర్తించింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..








