AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: పెంపుడు కుక్కపై ప్రేమతో.. నెత్తిన పెట్టుకుని చూసుకుంటున్నాడు.. వీడియో చూస్తే అవాక్కే..!

పెంపుడు కుక్కలపై మనుషుల ప్రేమ ఎంత గొప్పదో తెలుపుతూ ఓ వైరల్ వీడియో నెట్టింట సంచలనం సృష్టిస్తోంది. ఈ వీడియోలో ఒక వ్యక్తి తన పెంపుడు కుక్కను తలపై మోస్తూ తీసుకెళ్తుండటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. పెంపుడు జంతువు పట్ల అపరిమిత ప్రేమకు నిదర్శనంగా కొందరు భావిస్తే, మరికొందరు దీనిని వింతగా వర్ణిస్తున్నారు. ఈ దృశ్యం ఆన్‌లైన్‌లో విస్తృత చర్చకు దారి తీసింది.

Viral Video: పెంపుడు కుక్కపై ప్రేమతో.. నెత్తిన పెట్టుకుని చూసుకుంటున్నాడు.. వీడియో చూస్తే అవాక్కే..!
Viral Dog Love
Jyothi Gadda
|

Updated on: Dec 20, 2025 | 3:10 PM

Share

Viral Video: పెంపుడు జంతువుల్లో కుక్కలను ఇష్టంగా పెంచుకునేవారు ఎక్కువగా ఉంటారు. ముఖ్యంగా డాగ్‌ లవర్స్‌ వాటిని పెంచుకోవాలని, తరచూ వాటితో ఆడుకోవాలని ప్రయత్నిస్తుంటారు. ఆ ఇష్టంతోనే ఇప్పుడు చాలా మంది తమ ఇళ్లల్లో వివిధ రకాల జాతులకు చెందిన కుక్కలను పెంచుకుంటున్నారు. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు మనుషుల కంటే కుక్కలనే ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అవి ఎంతో విశ్వాసంతో, ప్రేమతో ఉంటాయని, మనుషులకు, ఇంటికి కాపలాగా వ్యవహరిస్తాయని నమ్ముతారు. వాటిని ఇంట్లో ఒక సభ్యుడిగా ప్రేమిస్తారు. ఎక్కడికి వెళ్లినా తమ వెంటే తీసుకువెళ్తుంటారు కూడా. కానీ, ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్న వీడియోలో ఒక వ్యక్తి తన పెంపుడు కుక్కపై ప్రేమతో ఏం చేశాడో చూస్తే మీరు నిజంగానే ఆశ్చర్యపోతారు.

సోషల్ మీడియాలో ఒక ఆసక్తికర వీడియో వైరల్ అవుతోంది. అందులో ఒక వ్యక్తి తన పెంపుడు కుక్కపట్ల ప్రేమతో ఎవరూ చేయని పనిచేశాడు. ఎవరైనా తమ ఇష్టమైన కుక్కను ఇంట్లోనే ఉంచుకుంటారు. తమ ఇంటి సభ్యుల్లో ఒకరిగా ప్రేమిస్తారు. ఈ క్రమంలోనే వారు ఎక్కడికి వెళ్లినా కూడా తమ వెంటే తమ కుక్కను కూడా తీసుకువెళ్తుంటారు. కానీ, వైరల్‌ వీడియోలో కనిపించిన వ్యక్తి మాత్రం తన కుక్కను తలపై పెట్టుకుని తన వెంట తీసుకువెళ్తున్నాడు. తలపై కుక్కతో రోడ్ల వెంట నడుచుకుంటూ వెళ్తుంటే.. చుట్టుపక్కల వారంతా ఈ దృశ్యాన్ని ఆశ్చర్యంగా చూస్తుండిపోయారు.

ఇవి కూడా చదవండి

చాలా మందికి ఈ దృశ్యం అసాధారణమైనదిగా కనిపించింది. కొందరు దీనిని సదరు పెంపుడు జంతువు పట్ల ఉన్న అపరిమిత ప్రేమను ప్రదర్శిస్తుందని అంటున్నారు. మరికొందరు దీనిని ఒక వింత అభిమానంగా వర్ణించారు. ఈ సీన్‌ చూసిన ప్రజలు ఉన్నచోటే ఆగిపోయి మరీ నోరెళ్లబెట్టి చూస్తున్నారు. కొందరు ఈ దృశ్యాన్ని తమ సెల్‌ఫోన్‌లో వీడియో తీసీ సోషల్ మీడియాలో షేర్‌ చేశారు. దాంతో ఈ వీడియో ఆన్‌లైన్‌లో విస్తృత చర్చను సృష్టిస్తోంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..