ఉత్తర ప్రదేశ్ యూట్యూబర్ అనురాగ్ ద్వివేది ఆన్లైన్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్ యాప్ల ద్వారా భారీగా డబ్బు సంపాదించాడు. ఈ అక్రమ సంపాదనతో బెంజ్, లంబోర్ఘిని వంటి లగ్జరీ కార్లు కొన్నట్లు ఈడీ గుర్తించింది. స్కై ఎక్స్ఛేంజ్ యాప్ ద్వారా ఎక్కువ సంపాదన వచ్చిందని, అక్రమ ఆస్తులను చట్టబద్ధమైనవిగా చూపించే ప్రయత్నం చేశాడని ఈడీ ఆరోపించింది. ఉన్నావాలోని అతని ఇంటిపై రైడ్ చేసి కార్లను సీజ్ చేసింది.