ఆ ఊరిలో విద్యార్థులు చదువుకోవాలంటే.. బడికి కాదు.. గుడి వెళ్లాల్సిందే.. ఎందుకో తెలుసా..?
అక్కడ బడికి వెళ్లి చదువుకోవాల్సిన పిల్లలు గుడిలో పాఠాలు నేర్చుకుంటున్నారు. టీచర్ చెప్పిన పాటలు శ్రద్ధగా వింటూ విద్యనభ్యసిస్తున్నారు. పాఠశాల గడప తొక్కాలంటే.. మొదటి రెండు తరగతులు గుడిలో కూర్చునే పాఠాలు వినాల్సిందే..! మూడో తరగతిలోనే పాఠశాలకు ఎంట్రీ.. ఎక్కడ..? ఎందుకో తెలుసా..?!

అక్కడ బడికి వెళ్లి చదువుకోవాల్సిన పిల్లలు గుడిలో పాఠాలు నేర్చుకుంటున్నారు. టీచర్ చెప్పిన పాటలు శ్రద్ధగా వింటూ విద్యనభ్యసిస్తున్నారు. పాఠశాల గడప తొక్కాలంటే.. మొదటి రెండు తరగతులు గుడిలో కూర్చునే పాఠాలు వినాల్సిందే..! మూడో తరగతిలోనే పాఠశాలకు ఎంట్రీ.. ఎక్కడ..? ఎందుకో తెలుసా..?!
అనకాపల్లి జిల్లాలోని ఎస్.రాయవరం మండలం తిమ్మాపురం శివారు కోనవానిపాలెం గ్రామం.. ఇక్కడ ప్రాథమిక పాఠశాల. ఈ పాఠశాలలో 27 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఆ బడికి ఒక్కటే గది. శిధిలావస్థకు చేరుకుంటుంది. కొంతమంది పిల్లలను బడి గదిలో పాఠాలు చెబుతున్నారు. మిగిలిన పిల్లలని రామాలయంలో పాఠాలు చెప్పేందుకు అనుమతించాలని గ్రామ పెద్దలు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో మిగిలిన కొంతమందికి పక్కనే ఉన్న రామాలయంలో విద్యా బుద్ధులు నేర్పిస్తున్నారు. 3,4 తరగతులు పాఠశాల గదిలోనే పెట్టారు. కానీ 1,2 తరగతులతోపాటు ఐదో తరగతి చదవాలంటే గుడిలోనే కూర్చోవాల్సిందే. స్కూలు జాయిన్ అయినా మూడో తరగతిలోకి వెళ్ళాకే అడుగు పెట్టాలి విద్యార్థి. రెండేళ్ల నుంచి ఇదే పరిస్థితి కొనసాగుతోందని అంటున్నారు విద్యార్థుల పేరెంట్స్.
మూడేళ్ల క్రితం నాడు-నేడు పథకం ద్వారా సుమారు 43 లక్షల రూపాయలతో రెండు గదుల స్కులు భవన నిర్మాణాన్ని ప్రారంభించారు. భవనం స్లాబ్ స్థాయికి నిర్మించిన తరువాత పనులు నిలిచిపోయాయి. ఆ తరువాత భవనం నిర్మాణం పూర్తిగా ఆగిపోయింది. దీంతో గ్రామస్తుల అనుమతితో 1,2, తరగతుల పిల్లలను గుడిలో చదువు చెబుతున్నామంటున్నారు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మయూరి. ప్రభుత్వం స్పందించి.. నిర్మాణ దశలో ఆగిపోయిన భవనాన్ని నిర్మిస్తే.. మరింత మంది పిల్లలు పాఠశాలలో అడ్మిషన్లు పొందుతారని అంటున్నారు. సాధ్యమైనంత త్వరగా ప్రభుత్వం తమ సమస్యపై స్పందించాలని కోరుతున్నారు విద్యార్థులు, పేరెంట్స్.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




