T20 WorldCup 2026 : వరల్డ్ కప్ కౌంట్‌డౌన్ స్టార్ట్.. అగార్కర్ మార్క్ సెలక్షన్..అక్షర్ పటేల్‌కు ఊహించని ప్రమోషన్
T20 WorldCup 2026 : ఫిబ్రవరి-మార్చి నెలల్లో భారత్, శ్రీలంక వేదికలుగా జరగనున్న ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026 కోసం టీమిండియాను నేడు అధికారికంగా ప్రకటించారు. ముంబైలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌తో కూడిన సెలక్షన్ కమిటీ సుదీర్ఘ చర్చల అనంతరం 15 మంది సభ్యుల తుది జట్టును ఖరారు చేసింది.

T20 WorldCup 2026 : వచ్చే ఏడాది జరగనున్న ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 కోసం ఎదురుచూస్తున్న కోట్లాది మంది భారత క్రికెట్ అభిమానుల నిరీక్షణకు తెరపడింది. ఫిబ్రవరి-మార్చి నెలల్లో భారత్, శ్రీలంక వేదికలుగా జరగనున్న ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026 కోసం టీమిండియాను నేడు అధికారికంగా ప్రకటించారు. ముంబైలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌తో కూడిన సెలక్షన్ కమిటీ సుదీర్ఘ చర్చల అనంతరం 15 మంది సభ్యుల తుది జట్టును ఖరారు చేసింది. నిన్న అహ్మదాబాద్‌లో సౌతాఫ్రికాతో మ్యాచ్ ముగించుకుని సూర్యకుమార్ యాదవ్ ఆలస్యంగా రావడంతో ప్రెస్ కాన్ఫరెన్స్ కొంచెం ఆలస్యంగా ప్రారంభమైంది.
2024 ప్రపంచకప్ గెలిచిన జట్టుతో పోలిస్తే ఈసారి టీమిండియాలో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజాల రిటైర్మెంట్ తర్వాత.. దాదాపు ఏడు కొత్త ముఖాలు ఈ మెగా టోర్నీలో కనిపించబోతున్నాయి. యువ ఆటగాళ్లపై నమ్మకంతో పాటు అనుభవజ్ఞుడైన అక్షర్ పటేల్‌కు వైస్ కెప్టెన్ బాధ్యతలు అప్పగించడం విశేషం. ప్రపంచకప్‌తో పాటు వచ్చే నెలలో న్యూజిలాండ్‌తో జరిగే సిరీస్‌కు కూడా ఇవే జట్లను ఎంపిక చేశారు.
🚨India’s squad for ICC Men’s T20 World Cup 2026 announced 🚨
Let's cheer for the defending champions 💪#TeamIndia | #MenInBlue | #T20WorldCup pic.twitter.com/7CpjGh60vk
— BCCI (@BCCI) December 20, 2025
ప్రపంచకప్ కోసం ప్రకటించిన భారత జట్టు : సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అక్షర్ పటేల్ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్య, శివం దూబె, రింకు సింగ్, జస్ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా, వాషింగ్టన్ సుందర్, ఇషాన్ కిషన్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి.
ఈ ఎంపికలో యశస్వి జైస్వాల్, రింకూ సింగ్‌ల విషయంలో తీవ్ర చర్చ జరగగా, రింకూను ప్రధాన జట్టులోకి తీసుకుని జైస్వాల్‌ను రిజర్వ్ ప్లేయర్‌గా ఉంచారు. అలాగే ఐపీఎల్‌లో మెరిసిన నితీష్ కుమార్ రెడ్డి, రియాన్ పరాగ్‌లను కూడా బ్యాకప్ ఆటగాళ్లుగా ఎంపిక చేశారు. హోమ్ గ్రౌండ్‌లో మ్యాచ్‌లు జరగనుండటంతో స్పిన్ విభాగానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్‌లను సెలెక్టర్లు జట్టులోకి ఆహ్వానించారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




