Winter Tips: చలికాలంలో తినే ఆహారంలో ఈ పండ్లు, కూరగాయలు చేర్చుకోండి.. శరీరంలో నీటి కొరత ఉండదు..
శీతాకాలంలో చాలా మంది వ్యక్తులు డీహైడ్రేషన్ సమస్యను ఎదుర్కొంటారు. దాహం లేదంటూ నీరు తాగడం తగ్గించేస్తారు. అటువంటి పరిస్థితిలో శరీరం హైడ్రేట్ గా ఉండాలంటే తినే ఆహారంలో కొన్ని పండ్లు, కూరగాయలను జోడించాలి. ఈ రోజు శీతాకాలంలో డీహైడ్రేట్ సమస్య నుంచి ఉపశమనం కోసం ఏ పండ్లు, కూరగాయలు తినాలో తెలుసుకుందాం..
చలికాలం రాగానే చలికి దూరంగా ఉండేందుకు వెచ్చని బట్టలు, వేడి ఆహార పదార్థాలపై ఎక్కువ శ్రద్ధ పెట్టడం ప్రారంభిస్తాం. అదే సమయంలో నీరు తాగడం కూడా తగ్గించేస్తారు. దీంతో శరీరం తరచుగా నీటి కొరతకు గురవుతుంది. ఎందుకంటే చలిలో మనకు తక్కువ దాహం అనిపిస్తుంది. ఇది డీహైడ్రేషన్ సమస్యను కలిగిస్తుంది, దీని కారణంగా చర్మం పొడిగా మారుతుంది. నీరసంగా ఉంటుంది. నీటి లోపాన్ని నివారించడానికి.. శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడానికి తినే ఆహారంలో నీరు అధికంగా ఉండే పండ్లను, కూరగాయలను చేర్చుకోవాలి.
ఇవి శరీరంలోని నీటి కొరతను తీర్చడమే కాదు పోషకాహారాన్ని సమృద్ధిగా కలిగి ఉండి, చలికాలంలో వచ్చే వ్యాధుల నుంచి కాపాడతాయి. శీతాకాలంలో తినడానికి చాలా ఉపయోగకరంగా ఉండే ఆ ప్రత్యేకమైన పండ్లు, కూరగాయల గురించి తెలుసుకుందాం.
కమలా ఫలం: చలికాలం రాగానే మార్కెట్‌లో కమలా ఫలం సందడి మొదలవుతుంది. చలికాలంలో వీటిని తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. విటమిన్ సి , నీరు పుష్కలంగా ఉంటాయి. దీన్ని తినడం వల్ల శరీరం హైడ్రేట్‌గా ఉండటమే కాదు రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఆరెంజ్ శీతాకాలంలో జలుబు , దగ్గు నుంచి రక్షించడంలో కూడా సహాయపడుతుంది. అటువంటి పరిస్థితిలో, శీతాకాలంలో ఖచ్చితంగా కమలా ఫలం తినాలి.
ముల్లంగి: భారతీయ వంటగదిలో దొరికే దుంప కూరలో ముల్లంగి ఒకటి. దీనిని సలాడ్‌గా విరివిగా తింటారు. ముల్లంగిలో 90% నీరు ఉంటుంది. ఇది శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడంలో సహాయపడుతుంది. ఇది జీర్ణవ్యవస్థను బలపరుస్తుంది. శరీరం నుంచి విష పదార్థాలను తొలగించడంలో సహాయపడుతుంది. అటువంటి పరిస్థితిలో తప్పనిసరిగా తినే ఆహారంలో ముల్లంగిని చేర్చుకోవాలి. దీన్ని సలాడ్‌తో పాటు కూరగాయగా కూడా తినవచ్చు.
క్యారెట్: క్యారెట్లు విటమిన్ ఎ , నీటికి అద్భుతమైన మూలం. ఇది చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడమే కాదు శరీరంలో నీటి కొరతను కూడా తీరుస్తుంది. శీతాకాలంలో క్యారెట్ జ్యూస్ చాలా మేలు చేస్తుంది. అందుకే వీలైతే క్యారెట్ జ్యూస్ తాగండి. క్యారెట్ కూర కూడా తయారుచేసుకుని తినవచ్చు.
పాలకూర: పాల కూరలో నీరు, ఇనుము పుష్కలంగా లభిస్తాయి. శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచడంతో పాటు శక్తిని కూడా అందిస్తుంది. పాలకూరతో తయారు చేసిన కూరగాయలు, సూప్‌లు శీతాకాలంలో మంచి ఎంపిక. అందువల్ల, తినే ఆహారంలో పాలకూరను ఖచ్చితంగా చేర్చుకోండి. అంతేకాదు మిక్స్డ్ వెజ్ జ్యూస్‌లో పాలకూరను కలుపుకుని కూడా తాగవచ్చు.
టొమాటో: టొమాటోలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. దీనిలో లైకోపీన్ పుష్కలంగా ఉంటుంది. దీన్ని తినడం వల్ల శరీరం హైడ్రేషన్‌తో పాటు చర్మం మెరుస్తుంది. చలికాలంలో టొమాటో సూప్ లేదా సలాడ్ తప్పకుండా తినండి. దీంతో శరీరంలో నీటి కొరత ఉండదు. చలికాలంలో వచ్చే చర్మ సమస్యల నుంచి దూరం చేసుకోవచ్చు.
ద్రాక్ష: ద్రాక్షలో నీరు, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇది శరీరం నుంచి విష పదార్థాలను తొలగించడంలో సహాయపడుతుంది. రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. చలికాలంలో దీన్ని అల్పాహారంగా తీసుకోవచ్చు.
కాలీఫ్లవర్: కాలీఫ్లవర్‌లో నీళ్లతో పాటు విటమిన్ సి, కె కూడా ఉంటాయి. ఇది చలి నుంచి శరీరాన్ని రక్షించడంలో, హైడ్రేట్ గా ఉంచడంలో సహాయపడుతుంది. శీతాకాలంలో క్యాలీఫ్లవర్ మార్కెట్‌లో కూడా సులభంగా దొరుకుతుంది. దీనిని కూరగాయలుగా చేసుకుని తినవచ్చు.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)