CM KCR: లాక్డౌన్ విధించాల్సిన అవసరం లేదు.. కానీ జాగ్రత్తగా ఉండాలి..
ఒమిక్రాన్ పట్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సీఎం కేసీఆర్ అన్నారు. అదే సమయంలో జాగ్రత్త ఉండాలన్నారు...
ఒమిక్రాన్ పట్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సీఎం కేసీఆర్ అన్నారు. అదే సమయంలో జాగ్రత్త ఉండాలన్నారు. ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లతో కరోనాను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ప్రస్తుతం లాక్ డౌన్ విధించాల్సిన అవసరం లేదన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ దవాఖానాల్లో 99% బెడ్లను ఆక్సిజన్ బెడ్లుగా మార్చాం తెలిపారు.
త్వరలోనే వంద శాతం ఆక్సిజన్ బెడ్లుగా మార్చాలని సీఎం ఆదేశించారు. హోమ్ ఐసోలేషన్ కిట్లను 20 లక్షల నుంచి ఒక కోటి అందుబాటులోకి తేవాలన్నారు. రెండు కోట్ల టెస్టింగ్ కిట్లను సేకరించాలని వైద్యారోగ్య ఉన్నతస్థాయి సమీక్షలో చెప్పారు. తక్షణమే ఆరోగ్య శాఖ లో ఉన్న భర్తీ లను పూర్తి చేయాలన్నారు. మరిన్ని బస్తీ దావఖానాలక ఏర్పాటుకు చేయాలన్నారు.
హెచ్ఎండీఏ పరిధిలోని కంటోన్మెంట్ జోన్ పరిధిలో ప్రజలకు సరైన వైద్య సేవలు మెరుగుపరిచేందుకు వార్డుకొకటి చొప్పున 6 బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. రసూల్ పుర -2, ఎల్.బి.నగర్-1, శేర్ లింగంపల్లి-1, కుత్బుల్లాపూర్-1, కూకట్ పల్లి-1, ఉప్పల్-1, మల్కాజిగిరి-1, జల్ పల్లి-1, మీర్ పేట-1, పిర్జాదీగూడ-1, బోడుప్పల్-1, జవహర్ నగర్-1, నిజాంపేట్ -1 చొప్పున బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేయాలని వైద్యాధికారులను సీఎం ఆదేశించారు.
హైదరాబాద్ బస్తీ దవాఖానాల స్ఫూర్తితో రాష్ట్రవ్యాప్తంగా నగరపాలికల్లో బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేయాలని, అందులో భాగంగా వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో 4 బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేయాలన్నారు. జగిత్యాల –1, సూర్యాపేట–1, సిద్ధిపేట –1, మహబూబ్ నగర్-2, నల్గొండ-2, మిర్యాలగూడ-1, రామగుండం-2, ఖమ్మం-2, నిజామాబాద్-3, కరీంనగర్-2, కొత్తగూడెం-1, పాల్వంచ-1, నిర్మల్-1, మంచిర్యాల-1, తాండూర్-1, వికారాబాద్-1, బోధన్-1, ఆర్మూర్-1, కామారెడ్డి-1, సంగారెడ్డి-1, జహీరాబాద్-1, గద్వాల్-1, వనపర్తి-1, సిరిసిల్ల-1, తెల్లాపూర్-1, బొల్లారం-1, అమీన్ పూర్-1, గజ్వేల్-1, మెదక్-1 చొప్పున బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేయాలన్నారు.
Read Also.. Corona Cases: రాష్ట్రంలో కొత్తగా 482 మందికి కరోనా.. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా నమోదు..