AP Corona: దేశవ్యాప్తంగా కొత్త వేరియంట్‌దడ.. మళ్లీ పుంజుకుంటున్న కరోనా కేసులు.. ఏపీలో కొత్తగా ఎన్నంటే?

దేశంలో ఒమిక్రాన్ దడ పుట్టిస్తోంది. కొత్త వేరియంట్‌ కేసులు పెరగడం టెన్షన్ పుట్టిస్తోంది. మహమ్మారికి మనమెంత దూరం? ఇప్పుడు అందరిలోను ఇదే ఆందోళన.

AP Corona: దేశవ్యాప్తంగా కొత్త వేరియంట్‌దడ.. మళ్లీ పుంజుకుంటున్న కరోనా కేసులు.. ఏపీలో కొత్తగా ఎన్నంటే?
Follow us
Balaraju Goud

|

Updated on: Jan 03, 2022 | 10:05 PM

Andhra Pradesh Covid 19 Cases: దేశంలో ఒమిక్రాన్ దడ పుట్టిస్తోంది. కొత్త వేరియంట్‌ కేసులు పెరగడం టెన్షన్ పుట్టిస్తోంది. మహమ్మారికి మనమెంత దూరం? ఇప్పుడు అందరిలోను ఇదే ఆందోళన. అయితే.. తెలుగురాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. మరోవైపు ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నా.. జాగ్రత్తలు అవసరమని వైద్య నిపుణులు చెప్తున్నారు. ప్రతీ ఒక్కరూ వ్యాక్సిన్‌ రెండు డోసులు పూర్తి చేసుకోవాలన్నారు.

ఇదిలావుంటే, తాజాగా ఆంధ్రప్రదేశ్​లో కరోనా కేసులు నిన్నటితో పోలిస్తే స్థిరంగా కొనసాగుతోంది. కొత్తగా 122 మందికి కొవిడ్​ పాజిటివ్​నిర్ధారణ అయ్యినట్లు ఏపీ ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఆదివారం ఉదయం 9 గంటల నుంచి సోమవారం ఉదయం 9 గంటల వరకు 15,568 శాంపిళ్లను పరీక్షించగా.. 122మందికి కరోనా వైరస్ సోకినట్లువెల్లడించింది.

ఇక, కరోనా మృతుల విషయానికొస్తే.. గడిచిన 24 గంటల్లో కొవిడ్ కారణంగా విశాఖపట్నం మరణించినట్లు ఏపీ ఆరోగ్య శాఖ వివరించింది. ఇదిలా ఉండగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 103 మంది కొవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్నట్లు ఆరోగ్య శాఖ పేర్కొంది.

Coronavirus

Coronavirus

ఇక, ఇప్పటి వరకు మొత్తం 3,13,97,635 శాంపిళ్లను పరీక్షించినట్లు తెలిపింది ఆరోగ్య శాఖ. అందులో 20,77,608 శాంపిళ్లు పాజిటివ్​గా తెలినట్లు వివరించింది. మొత్తం 20,61,832 మంది కరోనాను జయించగా.. 14,498 మంది కొవిడ్‌ మహమ్మారి ధాటికి ప్రాణాలను కోల్పోయారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 1,278 యాక్టివ్ కరోనా కేసులున్నాయి. విశాఖపట్నంలో అత్యధికంగా 236 యాక్టివ్ కేసులు ఉన్నట్లు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. Read Also….Corona Vaccination: టీనేజర్లకు ప్రారంభమైన వ్యాక్సినేషన్.. దేశవ్యాప్తంగా మొదటిరోజు ఎంతమంది పిల్లలు టీకాలు వేయించుకున్నారంటే..