Corona Cases: రాష్ట్రంలో కొత్తగా 482 మందికి కరోనా.. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా నమోదు..
రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఓ వైపు ఒమిక్రాన్ వేరియంట్ ఆందోళన కలిగిస్తున్న వేళ కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తోంది...
రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఓ వైపు ఒమిక్రాన్ వేరియంట్ ఆందోళన కలిగిస్తున్న వేళ కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తోంది. వారం క్రితం వరకు రెండు వందలు దాటని కరోనా వైరస్ కేసులు ఇప్పుడు మూడు వందల పైగా నమోదు అవుతున్నాయి. సోమవారం తెలంగాణలో 482 మందికి కరోనా సోకినట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.
రాష్ట్రంలో ఇప్పటి వరకు మహమ్మారి బారిన పడిన వారి సంఖ్య 6,82,971కి పెరిగింది. మహమ్మారి కారణంగా తాజా ఒకరు మృతి చెందారు. ఇప్పటి వరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 4,031కి చేరింది. తాజాగా వైరస్ నుంచి 212 మంది కోలుకున్నారు. సోమవారం 38,362 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 4,048 యాక్టివ్ కేసులు ఉన్నట్టు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి.
అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 294 కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డిలో 55 కేసులు నమోద కాగా… మేడ్చల్ మల్కాజిగిరిలో 48 కేసులు వచ్చాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోన్న విషయం. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యారోగ్య శాఖ కోరింది.
Read Also.. Holydays: ఈనెల 8 నుంచి 16 వరకు సంక్రాంతి సెలవులు.. కరోనా కేసులు పెరిగితే పొడిగింపే..!