NIT Recruitment: నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఫ్యాకల్టీ పోస్టులు.. నెలకు రూ. 50 వేలు జీతం పొందే అవకాశం..
NIT Recruitment 2021: నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. భారత ప్రభుత్వానికి చెందిన ఈ విద్యా సంస్థ తిరుచిరపల్లిలోని క్యాంపస్‌లో పలు ఫ్యాకల్టీ పోస్టులను...
NIT Recruitment 2021: నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. భారత ప్రభుత్వానికి చెందిన ఈ విద్యా సంస్థ తిరుచిరపల్లిలోని క్యాంపస్‌లో పలు ఫ్యాకల్టీ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏయో విభాగాల్లో ఎన్ని ఖాళీల ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.. లాంటి పూర్తి వివరాలు మీకోసం..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 22 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* వీటిలో సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ అప్లికేషన్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్, అర్కిటెక్చర్ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.
* అభ్యర్థుల వయసు 35 ఏళ్లు మించకూడదు.
ముఖ్యమైన విషయాలు..
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 50,000 జీతంగా చెల్లిస్తారు.
* అభ్యర్థులను మొదట పని ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేస్తారు. అనంతరం ఇంటర్వ్యూ ద్వారా తుది ఎంపిక ఉంటుంది.
* ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ 02-01-2022న ప్రారంభమవుతుండగా, 16-01-2022ని చివరి తేదీగా నిర్ణయించారు.
* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: Ayodhya: రామ జన్మభూమి రూపురేఖలు మార్చనున్న కేంద్రం.. సాంస్కృతిక రాజధానిగా అయోధ్య
YS Sharmila: అక్కడ పార్టీ పెట్టకూడదా.. మీడియాతో షర్మిల సంచలన కామెంట్స్..
Astro Tips: ప్రతిరోజూ ఉదయం మీరు ఇలా మొదలు పెట్టండి.. ఆనందం, సంతోషం, సక్సెస్ మీ వెంటే..