Indian Coast Guard Jobs: టెన్త్, ఇంటర్ అర్హతతో కేంద్రప్రభుత్వ ఉద్యోగాలు.. ఈరోజు నుంచే అప్లికేషన్స్.. ఎలా అప్లై చేయాలంటే..

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని ఇండియన్ కోస్ట్ గార్డ్ వివిధ డిపార్ట్‏మెంట్స్‏లలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

Indian Coast Guard Jobs: టెన్త్, ఇంటర్ అర్హతతో కేంద్రప్రభుత్వ ఉద్యోగాలు.. ఈరోజు నుంచే అప్లికేషన్స్.. ఎలా అప్లై చేయాలంటే..
Indian Coast Guard
Follow us

|

Updated on: Jan 04, 2022 | 9:14 AM

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని ఇండియన్ కోస్ట్ గార్డ్ వివిధ డిపార్ట్‏మెంట్స్‏లలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా నావిక్ (జనరల్ డ్యూటీ).. నావిక్ (డొమెస్టిక్ బ్రాంచ్), యాంత్రిక్ పోస్టులను భర్తీ చేయనుంది. ఆసక్తి.. అర్హత ఉన్న అభ్యర్థులు joinindiancoastguard.cdac.inలోని ఇండియన్ కోస్ట్ గార్డ్ అధికారకి వెబ్ సైట్ ద్వారా ఎలిజిబుల్ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. అయితే ఈ పోస్టులకు అప్లికేషన్స్ ప్రక్రియ ఈరోజు (జనవరి 4) నుంచి ప్రారంభమైంది. అప్లికేషన్ లింక్ ఈరోజు ఉదయం 11 గంటల నుంచి అందుబాటులో ఉంటుంది.

ఈ నోటిఫికేషన్ ద్వారా పలు విభాగాల్లో దాదాపు 322 పోస్టులను భర్తీ చేస్తారు. పోస్టులను బట్టి టెన్త్, ఇంటర్ ఉత్తీర్ణులైన వారు కూడా అర్హులే. దరఖాస్తు చేసుకోవడానికి జనవరి 14 చివరి తేది. మరీ ఈ పోస్టులకు ఎలా అప్లై చేయాలో తెలుసుకుందామా.

☞ ముందుగా.. joinindiancoastguard.cdac.inలో ఇండియన్ కోస్ట్ గార్డ్ అధికారిక వెబ్ సైట్ ఓపెన్ చేయాలి. ☞ ఆ తర్వాత హోమ్ పేజీలో కనిపించే రిజిస్ట్రేషన్ లింక్ పై క్లిక్ చేయాలి. ☞ అప్లికేషన్స్ ఫారంలో వివరాలను ఎంటర్ చేయాలి. ☞ వివరాలను ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయాలి. ☞ దీంతో మీ అప్లికేషన్ ఓకే అవుతుంది. ☞ ఆ తర్వాత కన్ఫర్మేషన్ పేజీ నుంచి మీ అప్లికేషన్ హార్డ్ కాపీని డౌన్ లోడ్ చేసుకోవాలి. ☞ ఒక్క అభ్యర్థి ఒక్క పోస్టుకు మాత్రమే అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ☞ దరఖాస్తు ప్రక్రియ జనవరి 4న ప్రారంభం కాగా.. జనవరి 14 చివరి తేదీ.

అర్హత వివరాలు.. ☞ నావిక్‌(జనరల్‌ డ్యూటీ) పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు మ్యాథ్స్, ఫిజిక్స్‌ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణులవ్వాలి. అభ్యర్థుల వయసు 18 నుంచి 22ఏళ్ల మధ్య ఉండాలి. ☞ నావిక్‌(డొమెస్టిక్‌ బ్రాంచ్‌) పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు గుర్తింపు పొందిన ఎడ్యుకేషన్‌ బోర్డుల నుంచి పదో తరగతి ఉత్తీర్ణులవ్వాలి. అభ్యర్థుల వయసు 18 నుంచి 22ఏళ్ల మధ్య ఉండాలి. ☞ యాంత్రిక్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు గుర్తింపు పొందిన ఎడ్యుకేషన్‌ బోర్డుల నుంచి పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు ఎలక్ట్రికల్‌/మెకానికల్‌/ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ టెలీకమ్యూనికేషన్‌(రేడియో/పవర్‌) ఇంజనీరింగ్‌లో డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి.

Also Read: Pushpa: నెట్టింట్లో బన్నీ మేనియా..  అమెజాన్ ప్రైమ్‏లో పుష్ప.. స్ట్రీమింగ్ డేట్ ఇదేనంటూ.. 

Bellamkonda Srinivas: టాకీ పార్ట్ పూర్తిచేసుకున్న హిందీ ఛత్రపతి.. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు..

Balakrishna: బాలకృష్ణ సినిమాలో విలన్‏గా కన్నడ హీరో.. అధికారికంగా ప్రకటించిన చిత్రయూనిట్..