BEL Recruitment 2022: భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో ట్రైనీ ఇంజనీర్ ఉద్యోగాలు.. ఇలా దరఖాస్తు చేయండి..
Trainee Engineer: భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ట్రైనీ ఇంజనీర్ పోస్టుల నియామకాన్ని ప్రకటించింది. ఆసక్తిగల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్, bel-india.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
BEL Recruitment 2022: భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ట్రైనీ ఇంజనీర్ పోస్టుల నియామకాన్ని ప్రకటించింది. ఆసక్తిగల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్, bel-india.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం 8 ఖాళీలు ఉన్నాయి. దరఖాస్తు చేసుకోవడానికి జనవరి 15 చివరి తేదీగా సంస్థ ప్రకటించింది. ఈ నియామకానికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇలా ఉన్నాయి.
పోస్టుల పేరు, మొత్తం ఖాళీలు: ట్రైనీ ఇంజనీర్ ఖాళీలు, మొత్తం ఖాళీల సంఖ్య – 8
అర్హత: అభ్యర్థి ఇంజనీరింగ్ (ఎలక్ట్రానిక్స్ / ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ / E & T / టెలికమ్యూనికేషన్స్) విభాగాల్లో ఒక ప్రసిద్ధ సంస్థ / విశ్వవిద్యాలయం నుంచి రెగ్యూలర్ BE / B.Tech కోర్సును పూర్తి చేసి ఉండాలి. అలాగే అన్ని సెమిస్టర్లలో 55% మొత్తం మార్కులు ఉండాలి.
జీతం: మొదటి సంవత్సరం: రూ. 30,000 రెండవ సంవత్సరం: రూ. 35,000 మూడవ సంవత్సరం: రూ. 40,000
వయోపరిమితి: అభ్యర్థి వయస్సు 28 ఏళ్లు పైబడి ఉండాలి. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల అభ్యర్థులకు 5 సంవత్సరాల వయస్సు సడలింపు ఇచ్చారు. అయితే వెనుకబడిన తరగతి (OBC) అభ్యర్థులకు 3 సంవత్సరాలు మినహాయింపు ఉంటుంది.
దరఖాస్తు రుసుము: జనరల్ అభ్యర్థులు రూ.200 దరఖాస్తు రుసుము చెల్లించాలి. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగ అభ్యర్థులకు ఎటువంటి రుసుము లేదు.
ఎంపిక ప్రక్రియ: ఇంజనీరింగలో వచ్చిన మొత్తం పాయింట్లు, సంబంధిత పోస్ట్-క్వాలిఫికేషన్ అనుభవంతో అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేస్తారు. వారికి ఇంటర్వ్యూలు నిర్వహించి ఎంపిక చేస్తారు.
ముఖ్యమైన తేదీ: దరఖాస్తు చేయడానికి చివరి తేదీ: 15/01/2022
ఈ నోటిఫికేషన్ గురించి మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేసి తెలుసుకోండి.
Also Read: RBI Recruitment 2022: ఆర్‌బీఐలో స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాలు.. ఎప్పటి నుంచి దరఖాస్తు చేసుకోవచ్చంటే?