AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SH Sarma Dead: 1971 ఇండో-పాక్ యుద్ధంలో పాల్గొన్న వైస్ అడ్మిరల్ SH శర్మ మృతి… రేపు అంత్యక్రియలు

SH Sarma Passed Away: 1971లో జరిగిన ఇండో-పాక్ యుద్ధంలో  పాల్గొన్న వీరుడు రిటైర్డ్ వైస్ అడ్మిరల్ ఎస్‌హెచ్ శర్మ సోమవారం కన్నుమూశారు. ఒడిశా భువనేశ్వర్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ..

SH Sarma Dead: 1971 ఇండో-పాక్ యుద్ధంలో పాల్గొన్న వైస్ అడ్మిరల్ SH శర్మ మృతి... రేపు అంత్యక్రియలు
Veteran Vice Admiral Retd S
Surya Kala
|

Updated on: Jan 04, 2022 | 12:53 PM

Share

SH Sarma Passed Away: 1971లో జరిగిన ఇండో-పాక్ యుద్ధంలో  పాల్గొన్న వీరుడు రిటైర్డ్ వైస్ అడ్మిరల్ ఎస్‌హెచ్ శర్మ సోమవారం కన్నుమూశారు. ఒడిశా భువనేశ్వర్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం 6.20 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఎస్‌హెచ్ శర్మకు 100 ఏళ్లు నిండాయని… వయసు రీత్యా ఎదురైనా అనారోగ్యానికి చికిత్స పొందుతూ మరణించారని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. SH శర్మ 1971లో పాకిస్థాన్‌తో యుద్ధం సమయంలో తూర్పు నౌకాదళానికి ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్‌గా ఉన్నారు.  అప్పుడు జరిగిన యుద్ధంలో భారతదేశం చేతిలో పాకిస్థాన్ ఘోర పరాజయాన్ని పొందింది. ఈ యుద్ధం అనంతరం బంగ్లాదేశ్ అనే సరికొత్త దేశం ప్రపంచ పటంలో రూపుదిద్దుకుంది. వైస్ అడ్మిరల్ SH శర్మ తూర్పు నౌకాదళ కమాండ్ .. ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్ గా కూడా పనిచేశారని ఇండియన్ నేవల్ ఆర్మీ అధికారులు తెలిపారు.

బుధవారం అంత్యక్రియలు:  ఎస్‌హెచ్ శర్మ భౌతికకాయాన్ని స్వగృహానికి తరలించారు. ప్రజలు నివాళులర్పించడానికి వీలుగా ఎస్‌హెచ్ శర్మ భౌతికకాయాన్ని ఉంచనున్నామని కుటుంబ సభ్యులు చెప్పారు. రేపు (జనవరి 5వ తేదీన ) అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

వైస్ అడ్మిరల్ SH శర్మ గత సంవత్సరం 2021 డిసెంబర్ 1వ తేదీన తన 100వ పుట్టినరోజును జరుపుకున్నారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన ఆజాదీ అమృత్ మహోత్సవ్ వేడుకల్లో కూడా పాల్గొన్నారు. అయితే అదే రోజు శర్మ 99వ ఏట అడుగుపెట్టినట్లు నేవీ అధికార ప్రతినిధి తెలిపారు.

రిటైర్డు వైస్ అడ్మిరల్ SH శర్మ మృతికి సంతాపం తెలుపుతూ ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ట్వీట్ చేస్తూ, “ఒడిశా కు చెందిన ప్రముఖుల్లో ఒకరైన వైస్ అడ్మిరల్ SH శర్మ మరణం తనకు చాలా బాధకలిగించిందని చెప్పారు. భారతదేశం కోసం అనేక యుద్ధాలు చేశారంటూ గుర్తు చేసుకున్నారు. శర్మ కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు.

భువనేశ్వర్‌లోని 120 బెటాలియన్ స్టేషన్ హెడ్‌క్వార్టర్స్‌లో వైస్ అడ్మిరల్ శర్మ మరణించినందుకు సంతాపం తెలుపుతూ కెప్టెన్ సంజీవ్ వర్మ ఒక సందేశంలో ఇలా అన్నారు, “అతను ఎల్లప్పుడూ మాకు స్ఫూర్తినిచ్చేవాడు.

వైస్ అడ్మిరల్ శర్మ  ఎప్పుడూ మాకు స్ఫూర్తినిచ్చే వ్యక్తి అంటూ భువనేశ్వర్‌లోని 120 బెటాలియన్ స్టేషన్ హెడ్‌క్వార్టర్స్‌ కెప్టెన్ సంజీవ్ వర్మ తన సందేశంలో తెలిపారు. శర్మ  ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్‌గా.. బంగాళాఖాతంలో భారతదేశం ఆక్రమణ వ్యూహాన్ని రూపొందించడంలో ముఖ్యమైన పాత్ర పోషించారంటూ గుర్తు చేసుకున్నారు.

13 రోజుల పాటు ఇండో-పాక్ యుద్ధం:  1971లో భారత్‌, పాకిస్థాన్‌ల మధ్య యుద్ధం జరిగింది. ఈ యుద్ధం జరిగి 50 ఏళ్లు పూర్తి చేసుకుంది.  50 సంవత్సరాల క్రితం.. 1971 , 16 డిసెంబర్ సాయంత్రం 4.35 గంటల.. , పాకిస్తాన్ సైన్యం  భారత్ తూర్పు కమాండ్ కి లొంగిపోయింది.  రెండు దేశాల 13 రోజులపాటు జరిగిన యుద్ధంలో పాకిస్థాన్ .. తూర్పు సెక్టార్‌లోనే కాకుండా పశ్చిమ సెక్టార్‌లోనూ పరాజయం పాలైంది.

Also Read:  ఓర్నీ దీని వేషాలో… టిప్ టాప్‌గా రెడీ అయిన కుక్కపిల్ల.. వీపుకి బ్యాగ్ వేసుకుని పయనం.. వీడియో వైరల్..