TS Congress: తెలంగాణ కాంగ్రెస్‌లో మరో రచ్చ.. AICC మీటింగ్‌ను పట్టించుకోని PCC పెద్దలు!

AICC ఆధ్వర్యంలో మంగళవారం కీలక సమావేశం జరిగింది. పార్టీ మెంబర్‌షిప్ కార్యక్రమం ముఖ్య ఎజెండాతో పార్టీ పెద్దలందరూ హాజరయ్యారు.. జిల్లాల్లో పార్టీ పరిస్థితిపై సమీక్ష నిర్వహించారు. కానీ కీలక నేతలంతా డుమ్మా కొట్టారు.

TS Congress: తెలంగాణ కాంగ్రెస్‌లో మరో రచ్చ..  AICC మీటింగ్‌ను పట్టించుకోని PCC పెద్దలు!
T Congress
Follow us
Balaraju Goud

|

Updated on: Jan 04, 2022 | 6:20 PM

Telangana Congress Cold War: AICC: ఆధ్వర్యంలో మంగళవారం కీలక సమావేశం జరిగింది. పార్టీ మెంబర్‌షిప్ కార్యక్రమం ముఖ్య ఎజెండాతో పార్టీ పెద్దలందరూ హాజరయ్యారు.. జిల్లాల్లో పార్టీ పరిస్థితిపై సమీక్ష నిర్వహించారు. కానీ కీలక నేతలంతా డుమ్మా కొట్టారు. ఒక్కొక్కరు ఒక్కో కారణంతో సమావేశానికి దూరంగా ఉన్నారు. ఎందుకు? ఇంతకీ తెలంగాణ కాంగ్రెస్‌లో ఏం జరుగుతోంది? ఇదే ఇప్పుడు సగటు కాంగ్రెస్ కార్యకర్తలో చర్చనీయాంశంగా మారింది.

తెలంగాణ కాంగ్రెస్‌లో రచ్చ మామాలుగా లేదు. జగ్గారెడ్డి సంధిచిన లేఖతో రేగిన దుమారం ఇంకా చల్లారనే లేదు. ఇప్పుడు మరో వివాదం. పార్టీలో ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా మారిపోయింది పరిస్థితి. గాంధీభవన్‌లో జరిగిన ముఖ్యనేతల సమావేశాన్ని పీసీసీ పెద్దలు పెద్దగా పట్టించుకోలేదు. AICC ఇంఛార్జ్ కార్యదర్శులు బోసు రాజు, శ్రీనివాస్ కృష్ణన్ సమక్షంలో జరిగిన మీటింగ్‌కు కూడా నేతలు డుమ్మా కొట్టడంతో పార్టీలోని విబేధాలు, వర్గపోరు మరోసారి బయటపడినట్లైంది.

ముఖ్యంగా పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డికి కరోనా సోకడంతో ఆయన సమావేశానికి హాజరు కాలేదని అంటున్నారు. అయితే, లోకల్‌గానే ఉన్నప్పటికీ.. అభివృద్ధి పనుల పేరుచెప్పి జగ్గారెడ్డి కూడా గైర్హాజరు కావడం చర్చనీయాంశంగా మారింది. ఇక, AICC ఆధ్వర్యంలో జరిగిన మీటింగ్‌కు.. AICC కన్వీనర్ ఏలేటి మహేశ్వర్‌రెడ్డి కూడా మొదట రాలేదు. దీంతో శ్రీనివాస్ కృష్ణన్ ఆయనకు ఫోన్‌చేసి పిలిపించారు. తనకు కనీస సమాచారం కూడా ఇవ్వకుండానే పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని ఫిర్యాదు చేశారు మహేశ్వర్‌రెడ్డి. అటు అజారుద్దీన్ పేరుకు వర్కింగ్ ప్రెసిడెంటే అయినా ఆయన ఎప్పుడూ పార్టీ మీటింగ్‌లకు హాజరయింది లేదు.

ఇక రేపు పొలిటికల్ అఫైర్స్‌ కమిటీ సమావేశం కూడా జరగాల్సి ఉంది. మొదట దీన్ని కూడా రద్దు చేయాలని భావించారు. కానీ ఆ తర్వాత జూమ్‌లో మీటింగ్‌ జరపాలని నిర్ణయించారు. అదీ సంగతి.. ఏ మీటింగ్ పెడితే ఎవరు వస్తారో రారో తెలియని పరిస్థితి నెలకొంది కాంగ్రెస్‌లో. రేవంత్‌రెడ్డి సీనియర్ల మధ్య గ్యాప్‌ కంటిన్యూ అవుతోంది. ఇప్పటికే పలు ఫిర్యాదులు హైకమాండ్‌ వద్దకు చేరాయి..

Read Also…  JP Nadda in Hyderabad: హైదరాబాద్ చేరుకున్న బీజేపీ చీఫ్ జేపీ నడ్డా.. శంషాబాద్‌ విమానాశ్రయంలో హైటెన్షన్!