dog in white house: వైట్‌హౌస్‌లో కొత్తగా బుజ్జి కుక్క!.. పెంపుడు కుక్క ‘‘కమాండర్’’.. స్వాగతం పలికిన జో బైడెన్..(వీడియో)
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కుటుంబంలోకి కొత్తగా ఇద్దరు సభ్యులు చేరారు. కమాండర్ అనే జర్మన్ షెపర్డ్ కుక్కపిల్ల ఇప్పటికే విచ్చేయగా.. మరో పిల్లి జనవరిలో వైట్‌హౌస్‌లోకి అడుగుపెట్టనుంది. వీటి రాకతో బైడెన్ కుటుంబానికి చెందిన మేజర్ అనే మరో జర్మన్ షెపర్డ్ కుక్కకు ఒంటరితనం తీరిపోనుంది.
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కుటుంబంలోకి కొత్తగా ఇద్దరు సభ్యులు చేరారు. కమాండర్ అనే జర్మన్ షెపర్డ్ కుక్కపిల్ల ఇప్పటికే విచ్చేయగా.. మరో పిల్లి జనవరిలో వైట్‌హౌస్‌లోకి అడుగుపెట్టనుంది. వీటి రాకతో బైడెన్ కుటుంబానికి చెందిన మేజర్ అనే మరో జర్మన్ షెపర్డ్ కుక్కకు ఒంటరితనం తీరిపోనుంది. అధ్యక్షుడు బైడెన్ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో 3 నెలల కుక్కపిల్ల ఫోటోలను షేర్ చేశారు. ” వైట్‌హౌస్‌కి స్వాగతం కమాండర్” అంటూ ఓ వీడియోను పంచుకున్నారు. వీడియోలో బైడెన్ ఓ బాల్‌ను గాల్లోకి విసురుతూ కుక్కతో ఆడుకుంటూ కనిపించారు. జో బైడెన్ సోదరుడు జేమ్స్ బైడెన్, సారా బైడెన్ దంపతులు కమాండర్‌ను కానుకగా ఇచ్చారు. కాగా జో బైడెన్ దంపతులకు అత్యంత ఇష్టమైన పెంపుడు కుక్క ఛాంప్ ఈ ఏడాది జూన్‌లో మరణించిన సంగతి తెలిసిందే. జర్మన్ షెపర్డ్ జాతికి చెందిన ఛాంప్‌ను 2008లో అమెరికా ఉపాధ్యక్షుడిగా ఉన్న సమయంలో బైడెన్ కొనుగోలు చేశారు. జంతుప్రేమికుడైన ఆయనకు జర్మన్ షెపర్డ్ జాతికే చెందిన మరో కుక్క మేజర్ కూడా ఉంది. ఛాంప్ మృతితో మేజర్ ఒంటరైంది. డొనాల్డ్ ట్రంప్ నాలుగేళ్ళ పరిపాలనలో వైట్‌హౌస్‌లో పెంపుడు జంతువులకు స్థానం లేకుండా పోయింది. అయితే బైడెన్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత శ్వేతసౌధంలో మళ్ళీ వాటికి స్థానం లభించింది.