Covid Vaccine – Telangana : మరీ ఇంత నిర్లక్ష్యమా?.. వ్యాక్సీన్ వేయకుండానే వేసినట్లు మెసేజ్‌లు.. ఆగ్రహంలో జనాలు..

Covid Vaccine - Telangana : మళ్లీ కరోనా విజృంభిస్తున్న వేళ.. అధికారుల నిర్లక్ష్యం ప్రజల పాలిట శాపంలా మారింది. వైరస్ బారిన పడకుండా ఉండేందుకు వ్యాక్సీనే శ్రీరామ రక్ష అని,

Covid Vaccine - Telangana : మరీ ఇంత నిర్లక్ష్యమా?.. వ్యాక్సీన్ వేయకుండానే వేసినట్లు మెసేజ్‌లు.. ఆగ్రహంలో జనాలు..
Vaccine
Follow us
Shiva Prajapati

| Edited By: Anil kumar poka

Updated on: Jan 05, 2022 | 4:29 PM

Covid Vaccine – Telangana : మళ్లీ కరోనా విజృంభిస్తున్న వేళ.. అధికారుల నిర్లక్ష్యం ప్రజల పాలిట శాపంలా మారింది. వైరస్ బారిన పడకుండా ఉండేందుకు వ్యాక్సీనే శ్రీరామ రక్ష అని, వ్యాక్సీన్ వేయించుకోవాలని ఓ వైపు ప్రజలకు చెబుతున్న అధికారులు.. మరోవైపు తీవ్రమైన నిర్లక్ష్యంతో వ్యవహరిస్తున్నారు. వ్యాక్సీన్ వేయకుండానే వేసినట్లుగా చూపుతున్నారు. టార్గెట్ రీచ్ కావడానికి అడ్డదారులు తొక్కుతున్నారు. ఫలితంగా సెకండ్ డోస్ సైడ్ ట్రాక్ పడుతోంది. నిర్మల్ జిల్లా భైంసాలో అధికారుల నిర్వాకం వెలుగు చూసింది.

వివరాల్లోకెళితే.. కోవిడ్‌ వ్యాక్సినేషన్ ప్రక్రియను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సీరియస్‌గా తీసుకుంటే, అధికారులేమో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. వ్యాక్సినేషన్‌పై అవగాహన కల్పించాల్సిన వైద్యారోగ్య సిబ్బంది టార్గెట్‌ రీచ్ కావడానికి అడ్డదారులు తొక్కుతున్నారు. తెలంగాణలో ఫస్ట్‌ డోస్‌ తీసుకున్నవాళ్లలో మెజారిటీ పీపుల్‌కి సెకండ్‌ డోస్ కంప్లీట్‌ కాలేదు. సెకండ్‌ డోస్‌ వేయడానికి గడువు కంప్లీట్‌ కాకపోవడం ఒక కారణమైతే, ప్రజల నిర్లక్ష్యం మరో కారణం. దీన్నే వైద్యారోగ్యశాఖ సిబ్బంది అడ్వాంటేజ్‌గా తీసుకున్నారో ఏమో తెలియదు గాని, నిర్మల్‌ జిల్లాలో టార్గెట్ రీచ్‌ కావడానికి అడ్డదారులు తొక్కారు. సెకండ్‌ డోస్ వేయకపోయినా, వేసినట్లుగా ఫోన్లకు మెస్సేజ్‌లు పంపారు. రెండు డోసులు కంప్లీటైనట్టు సర్టిఫికెట్లు కూడా ఇచ్చేశారు.

భైంసా మండలం మహాగామ్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అయితే 100శాతం వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తయినట్లు రికార్డుల్లో చూపారు. సెకండ్‌ తీసుకోకపోయినా తీసుకున్నట్లు ఫోన్లకు మెసేజ్‌లు రావడంతో అవాక్కయిన జనం వ్యాక్సినేషన్ సెంటర్లకు క్యూ కట్టారు. భైంసా ఏరియా ఆస్పత్రికితోపాటు బాసర, మధోల్‌, తానూరు, కుభీర్‌, మహాగామ్‌, కుంటాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను చుట్టుముట్టారు. సెకండ్‌ డోస్‌ వేయకుండానే వేశారని ఎలా మెసేజ్‌ పంపారంటూ నిలదీశారు. జనం నిలదీయడంతో వైద్యాధికారులు కవర్ చేసుకునే ప్రయత్నం చేశారు. సాంకేతిక లోపం అంటూ సాకులు చెబుతున్నారు. పైనుంచి వస్తున్న ఒత్తిళ్ల కారణంగానే టార్గెట్‌ రీచ్‌ కాకపోయినా, వంద శాతం వ్యాక్సినేషన్ జరిగినట్టు, ఇలా మెస్సేజ్‌లు పంపినట్లు తెలుస్తోంది. ఇప్పుడైనా వ్యాక్సినేషన్ ప్రక్రియను సక్రమంగా నిర్వహించాలని ప్రజలు కోరుతున్నారు.

ఇదిలాఉంటే.. తెలంగాణలో కోవిడ్‌ థ‌ర్డ్ వేవ్ ఉదృతి మొద‌లైంది. క‌రోనా ప‌డ‌గ విప్పింది. ఒక్కరోజే వెయ్యికి పైగా కేసులు న‌మోదు అయ్యాయి. ఒక్కరోజే తెలంగాణ‌లో 1052 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. ఇద్దరు మృతి చెందారు. వీటితో పాటు మ‌రో 10 ఒమిక్రాన్ కేసులు కావ‌డం అందోళ‌న క‌ల్గిస్తోంది. ఒమిక్రాన్ కేసుల సంఖ్య రాష్ట్రంలో అధికారికంగా 94కి చేరింది. ఇప్పటికే ఒమిక్రన్ తెలంగాణ‌లో సామాజిక వ్యాప్తి జ‌రిగిపోయింద‌ని వైద్యశాఖ ఉన్నతాధికారులే హెచ్చరిస్తున్నారు.

మరోవైపు మారుతున్న వాతావ‌ర‌ణ ప‌రిస్థితుల నేప‌థ్యంలో సీజ‌న‌ల్ వ్యాధులు ప్రబ‌లుతున్నాయి. ఏదీ సీజ‌న‌ల్ వ్యాధి? ఏదీ క‌రోనా? ఏదీ ఒమిక్రాన్? తెలియ‌క సామాన్య జ‌నం భ‌యాందోళ‌న‌కు గుర‌వుతున్నారు. ఈ నేప‌థ్యంలో తెలంగాణ ప్రభుత్వం త్వర‌లోనే ఇంటింటికి వెళ్లి ఫీవ‌ర్ స‌ర్వే చేయ‌డానికి ఏర్పాట్లు చేస్తోంది. హోం ఐసోలేష‌న్ కిట్స్ అందించడానికి ఏర్పాట్లు చేస్తోంది.

Also read:

Telangana Intermediate Board: ఇంటర్ పరీక్ష ఫీజుల తేదీలు ఖరారు.. ఫీజు, చివరి తేదీ వివరాలు ఇక్కడ తెలుసుకోండి..

APSRTC Bus: ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. సంక్రాంతికి స్పెషల్ బస్సులు..

Omicron: రాష్ట్రాలపై పంజా విసరుతున్న ఒమిక్రాన్.. తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న కేసులు