Telangana: ఇది కదా గుడ్‌న్యూస్ అంటే.. తెలంగాణ స్కూళ్లకు ఒంటిపూట బడులు.. ఎప్పటినుంచంటే

తెలంగాణలో కులాల లెక్క తేలుస్తామంటోంది అధికార పార్టీ. ఈ సర్వే సకలజనుల సర్వేలా ఉండబోదని బీసీ కమిషన్ చెబుతుంటే.. కోర్టు చెప్పాక ఈ కమిషన్‌ దండగ అంటోంది బీఆర్ఎస్‌ . అసలు కులగణనకు చట్టబద్ధతే లేదంటోంది.

Telangana: ఇది కదా గుడ్‌న్యూస్ అంటే.. తెలంగాణ స్కూళ్లకు ఒంటిపూట బడులు.. ఎప్పటినుంచంటే
Schools
Follow us

|

Updated on: Nov 02, 2024 | 9:36 AM

ఈనెల 6 నుంచి తెలంగాణలో కులగణన ప్రారంభంకానుంది. సమగ్ర కులగణనకు 36 వేల 559 మంది సెకండరీ గ్రేడ్ టీచర్లను, 3 వేల 414 ప్రైమరీ స్కూల్ హెడ్మాస్టర్లు మరో 8 వేల మంది ఇతర సిబ్బందిని నియమించింది ప్రభుత్వం. సర్వే పూర్తయ్యే వరకు ప్రైమరీ స్కూళ్లు ఒక్కపూటనే నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంటవరకు ఉపాధ్యాయులు స్కూళ్లలో పనిచేయాలి. తర్వాత కులగణనకు ఇంటింటికి వెళ్లాలి.

ఇది చదవండి: బాబోయ్.! 5 స్టాప్‌లు, 11 గంటలు.. ఈ వందేభారత్ రైలు రూటే సపరేటు

ప్రతి 150 ఇళ్లకు ఒక పర్యవేక్షణ అధికారితో పాటు కులగణన అధికారులను నియమించింది. 50 ప్రశ్నల ద్వారా డేటా సేకరించనున్నారు అధికారులు. ఇందుకోసం ప్రత్యేకంగా సర్వే కిట్లను అందజేశారు. కులగణనపై ఈనెల 13 వరకు ప్రజాభిప్రాయ సేకరణ ఉంటుందని బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ తెలిపారు. ఈ కులగణన సకలజనుల సర్వేలాగా ఉండదన్నారాయన. సర్వే రిపోర్ట్‌ను దాచిపెట్టుకోకుండా ప్రజల ముందు పెడతామన్నారు. కరీంనగర్‌లో ప్రజాభిప్రాయసేకరణ రసాభాసగా మారింది.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: పురాతన తవ్వకాల్లో బయటపడ్డ నల్లటి ఆకారం.. ఏంటని చూడగా.. అమ్మబాబోయ్.!

బీసీ కమిషన్‌కు చట్టబద్ధత లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆరోపించారు. అయినా ప్రజాభిప్రాయ సేకరణ ఎందుకు చేస్తున్నారని నిలదీశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇవ్వాలన్న ఆలోచన కాంగ్రెస్ సర్కార్‌కు లేదు కాబట్టే నామ్‌కేవాస్త్‌ ప్రజాభిప్రాయ సేకరణ చేస్తున్నారని విమర్శించారు బీఆర్ఎస్ నేతలు. మరోవైపు కుల సంఘాలు కూడా కులగణన, బీసీ కమిషన్‌పై పెదవి విరుస్తున్నాయి. లెక్కలు పక్కాగా రాకపోతే ఊరుకునేది లేదంటున్నాయి. మరోవైపు విపక్షాలు, కులసంఘాల ఆరోపణలను విమర్శలను పట్టించుకోకుండా కులగణనకు అన్నిఏర్పాట్లు చేసింది ప్రభుత్వం. 50 ప్రశ్నల ద్వారా డేటా సేకరించాలని నిర్ణయించింది. ఈనెల 30లోగా సర్వే పూర్తిచేయాలని డెడ్‌ లైన్ విధించింది.

ఇది చదవండి: అజీర్తి, కడుపు ఉబ్బరంతో ఆస్పత్రికొచ్చిన వ్యక్తి.. అమ్మబాబోయ్! ఎక్స్‌రే చూడగా

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

తన లవ్‌ స్టోరీ చెబుతూ సిగ్గు పడిన హీరో
తన లవ్‌ స్టోరీ చెబుతూ సిగ్గు పడిన హీరో
బ్రహ్మంగారు చెప్పినట్టే చింత చెట్టుకు పారుతున్న కల్లు
బ్రహ్మంగారు చెప్పినట్టే చింత చెట్టుకు పారుతున్న కల్లు
ఆ స్కూలు మొత్తానికీ స్టూడెంట్‌ ఒక్కరే.. టీచర్ ఒక్కరే !!
ఆ స్కూలు మొత్తానికీ స్టూడెంట్‌ ఒక్కరే.. టీచర్ ఒక్కరే !!
పెట్రోల్‌ బంకులో లైటర్‌ వెలిగించిన ఆకతాయిలు.. ఆ తర్వాత ??
పెట్రోల్‌ బంకులో లైటర్‌ వెలిగించిన ఆకతాయిలు.. ఆ తర్వాత ??
కంటి కింద కొబ్బరి నూనెతో మసాజ్‌.. ఫలితం ఎలా ఉంటుందో తెలుసా !!
కంటి కింద కొబ్బరి నూనెతో మసాజ్‌.. ఫలితం ఎలా ఉంటుందో తెలుసా !!
అర్ధరాత్రి బైక్ పై వెళ్తుండ‌గా ఎదురొచ్చిన సింహం.. ఆ త‌ర్వాత ??
అర్ధరాత్రి బైక్ పై వెళ్తుండ‌గా ఎదురొచ్చిన సింహం.. ఆ త‌ర్వాత ??
ఘనంగా శ్రీ చిన్న జీయర్ స్వామి పుట్టినరోజు వేడుకలు.. వీడియో
ఘనంగా శ్రీ చిన్న జీయర్ స్వామి పుట్టినరోజు వేడుకలు.. వీడియో
దీపావళిలో వెండికి వెలుగులు.. కొనుగోళ్లలో సిల్వర్‌ రికార్డ్‌ల మోత!
దీపావళిలో వెండికి వెలుగులు.. కొనుగోళ్లలో సిల్వర్‌ రికార్డ్‌ల మోత!
కాలనీలో టపాసులు కాల్చొద్దని పొరుగింటి వారు చేసిన పని తెలిస్తే..
కాలనీలో టపాసులు కాల్చొద్దని పొరుగింటి వారు చేసిన పని తెలిస్తే..
ప్రతీ రోజూ ఈ ఆకు కూర తినండి.. ఫలితం మీరే చూడండి !!
ప్రతీ రోజూ ఈ ఆకు కూర తినండి.. ఫలితం మీరే చూడండి !!