Telangana: దొంగల దెబ్బకు ఒక్కరోజంతా పట్టణ బంద్.. నిందితులను పట్టించిన పసుపు కుంకుమ!

భైంసా పట్టణ బంద్ కు కారణమైన.. పట్టణ శివారులోని నాగదేవత ఆలయంలో చోరి , ఆలయ పాక్షిక ధ్వంసం కేసును 48 గంటల వ్యవధిలో పోలీసులు చేధించారు. భైంసా ఏఎస్పీ అవినాష్ కుమార్, పట్టణ సీఐ గోపినాథ్ లు సంబంధిత చోరీ ఘటనను ఛాలెంజ్‌గా తీసుకుని ఛేదించి విజయం సాధించారు. గురువారం ఉదయం భైంసాలోని ఎస్పీ క్యాంప్ ఆఫీస్ లో జిల్లా ఎస్పీ జానకీ షర్మిలా చోరీ కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు.

Telangana: దొంగల దెబ్బకు ఒక్కరోజంతా పట్టణ బంద్.. నిందితులను పట్టించిన పసుపు కుంకుమ!
Bainsa Crime
Follow us
Naresh Gollana

| Edited By: Balaraju Goud

Updated on: Jan 02, 2025 | 1:32 PM

న్యూ ఈయర్ వేడుకలను ఫుల్ జోష్ లో జరుపుకుందామనుకున్నారు ఓ ఇద్దరు దొంగలు. పార్టీ చేసుకునేందుకు అన్నీ ప్లాన్ చేసుకున్నారు. మందు, విందు పార్టీకి డబ్బులు కావాలిగా..! అందుకే భారీ స్కెచే వేశారు. అనుకున్నదే తడువుగా ఫ్లాన్‌ను అమలు చేశారు. కానీ ఆ దొంగలు చేసిన ఘనకార్యానికి‌ ఏకంగా ఓ పట్టణమంతా న్యూ ఈయర్ ను బంద్ తో స్వాగతం పలకాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంతకి న్యూ ఈయర్ కోసం దొంగలు చేసిన పనేంటీ..? పట్టమంతా బంద్ చేయాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది..? దొంగలను పట్టించిన పసుపు కుంకుమల ట్విస్ట్ ఏంటో తెలుసుకోవాలంటే బైంసా ఆలయం చోరీ ఘటనలోకి వెళ్లాల్సిందే‌..!

నిర్మల్ జిల్లా బైంసాలో వివాదాస్పదంగా మారిన నాగదేవత ఆలయ చోరీ ఘటనను పోలీసులు 48 గంటల్లో ఛేదించారు. దొంగలు చోరీ సమయంలో ఆలయం పాక్షికంగా ద్వంసం కావడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన బైంసా భక్తజనం, హిందు సంఘాలు పట్టణ బంద్‌కు పిలుపునిచ్చారు. గత ఏడాది డిసెంబరు 31న ఘటన జరగగా, జనవరి 1న బైంసా పట్టణ బంద్ కు పిలుపునిచ్చాయి హిందు సంఘాలు‌. దీంతో ఘటనను సీరియస్‌గా తీసుకున్న బైంసా పోలీసులు.. నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఆదేశాలతో లోతుగా దర్యాప్తు చేసి కేవలం 48 గంటల్లోనే కేసును ఛేదించారు. సీసీ కెమెరాల్లో నిందితుల దుస్తులకు పసుపు కుంకుమ అంటుకుని ఉండటంతో ఆ కోణంలో విచారణ జరిపిన పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. విచారణలో నిందితులు వెల్లడించిన వివరాలు విని పోలీసులు సైతం విస్తుపోయారు.

భైంసా మండలం చుచుంద్ గ్రామానికి చెందిన విశాల్, సంఘ రతన్ అనే ఇద్దరు స్నేహితులు. నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు గాను డబ్బులు లేకపోవడంతో చోరీ చేయాలని నిర్ణయానికి వచ్చారు. ఇందులో భాగంగానే నాగదేవత ఆలయానికి వెళ్లి మందిరం తాళం పగులగొట్టి లోనికి వెళ్లి దొంగతనానికి పాల్పడ్డారు. ఆలయంలోని హుండీ కానుకలతో పాటు గుడిలోని గంటలను సైతం వీరు చోరీ చేశారు. ఆ సమయంలో హుండీని బద్దలు కొట్టేందుకు తీవ్రంగా ప్రయత్నించడంతో ఆలయం పాక్షికంగా ధ్వంసం అయింది. దీంతో హిందు సంఘాలు భగ్గుమన్నాయి. ఏకంగా బైంసా పట్టణ బంద్ కు పిలుపునిచ్చాయి. అయితే ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్నామని.. వెంటనే పోలీస్ టీంలను రంగంలోకి దింపి నిందితులను‌ అదుపులోకి తీసుకున్నామని ఎస్పీ జానకి షర్మిల తెలిపారు.

దొంగతనానికి పాల్పడుతున్న సమయంలో దొంగలిద్దరూ ధరించిన దుస్తులకు ఆలయంలోని పసుపు, కుంకుమ అంటుకుందని.. అంతే కాకుండా చోరీ జరిగిన సమయంలో ఉదయం 4 గంటల నుండి 6 గంటల సమయంలో పట్టణ ప్రవేశ మార్గంలోని సీసీ కెమెరాలన్నింటిని పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంలో చోరీకి పాల్పడ్డిన ఇద్దరిలో ఒకరికి పసుపు, కుంకుమ అంటినట్లుగా గుర్తించి అనుమానితుడిగా భావించి విచారణ చేపట్టామని తెలిపారు‌ ఎస్పీ జానకి షర్మిల. 48 గంటల వ్యవధిలో కేసును ఛేదించిన భైంసా ఏఎస్పీ అవినాష్ కుమార్, టౌన్ సీఐ గోపినాథ్ తోపాటు పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ జానకీ షర్మిల అభినందించారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..