Warangal: ‘తెలంగాణ దావత్’ అంట..! లిక్కర్ పంపిణీ చేసిన లీడర్.. ఓరుగల్లులో రచ్చ రచ్చ..!
నవీన్ రాజ్‌కు పార్టీ పదివి లేదు.. ఇటు ఎలెక్టెడ్, నామినేటెడ్ పదవి లేదు.. కానీ భద్రకాళి అమ్మవారి ఆలయంలో ఆయనకు ప్రోటోకాల్ దర్శనం కల్పించడం జనంలో చర్చగా మారింది. అమ్మవారి ఆలయం గేటు ముందే క్రేన్ సహాయంతో భారీ గజమాలవేసి హల్ చల్ చేశారు అభిమానులు.
తనకు ఇష్టమైన నాయకుడి కోసం వినూత్న రీతిలో అభిమానాన్ని చాటుకున్నాడు ఓ కార్యకర్త. ఈ ఘటన ఓరుగల్లులో ఆసక్తికర చర్చకు దారితీసింది. అతని జన్మదిన సందర్భంగా మందుబాబులకు మద్యం బాటిళ్లు ఫ్రీ సరఫరా చేసి హాట్ టాపిక్ అయ్యాడు. వెర్రి వెయ్యి విధాలు అన్నట్లు జనంలో చర్చగా మారిన ఆయన నాయకుడు ఎవరూ..? ఆయన జన్మదిన సందర్భంగా లిక్కర్ బాటిల్ పంచిన ఆ అభిమాని ఎవరో తెలుసుకుందాం..!
వరంగల్ నగరంలో మంత్రి కొండా సురేఖ అనుచరుడు.. షాడో మంత్రిగా ఈమధ్య పార్టీలో ప్రజలలో చర్చగా మారుతున్న గోపాల నవీన్ రాజ్ బర్త్ డే వేడుకలు బుధవారం వరంగల్ లో జరిగాయి. ఆయన జన్మదిన వేడుకలు న్యూ ఇయర్ రోజే రావడంతో అభిమానుల్లో తెగ సందడి నెలకొంది. దీంతో ఉప్పొంగిన అభిమానంతో గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు ఆయన అనుచరులు. అందరిలా చేసుకుంటే ఏం బాగుటుంది. అందుకే ఒక అడుగు ముందుకేసి, తాగినోడికి తాగినంతగా మద్యం బాటిళ్లను ఫ్రీగా అందించారు.
నవీన్ రాజ్‌కు పార్టీ పదివి లేదు.. ఇటు ఎలెక్టెడ్, నామినేటెడ్ పదవి లేదు.. కానీ భద్రకాళి అమ్మవారి ఆలయంలో ఆయనకు ప్రోటోకాల్ దర్శనం కల్పించడం జనంలో చర్చగా మారింది. అమ్మవారి ఆలయం గేటు ముందే క్రేన్ సహాయంతో భారీ గజమాలవేసి హల్ చల్ చేశారు అభిమానులు. ఆలయ ప్రధాన దారం ముందు భారీగా ట్రాఫిక్ స్తంభించేలా చేయడంతో జనం ఒక దశలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక వైపు గజమాల వివాదం రగులుతున్న నేపథ్యంలోనే ఓ అభిమాని నవీన్ రాజ్ జన్మదిన కానుకగా మద్యం ప్రియులకు లిక్కర్ బాటిల్స్ ఫ్రీగా పంపిణీ చేశాడు. తన అభిమాన నాయకుడు జన్మదినం సందర్భంగా తెలంగాణ దావత్ అనే పేరుతో మద్యం ప్రియులను లిక్కర్ షాప్ వద్దకు పిలిచి క్యూలో నిలబెట్టాడు. వారికి క్వార్టర్ బాటిల్స్, ఆఫ్ బాటిల్ ఉచితంగా సరఫరా చేసి తన అభిమానాన్ని చాటుకున్నాడు. ఇదే ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
వీడియో చూడండి..
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.